బోడుప్పల్ లో గంజాయి విక్రయిస్తున్న వ్యక్తుల అరెస్ట్
On
విశ్వంభర, హైదరాబాద్ : రంగారెడ్డి ఎన్‌ఫోర్స్‌మెంట్ టీమ్ సీఐ సుభాష్ చందర్, ఎస్సై అఖిల్ సిబ్బంది కలిసి ఘట్కేసర్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని బోడుప్పల్ లోని రెండు ప్రాంతాల్లో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేశారు. బోడుప్పల్ ప్రాంతంలో గంజాయి అమ్మకాలు జరుపుతున్న అమర్ అనే వ్యక్తి వద్ద నుంచి 1.1 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇదే ప్రాంతంలో మరో చోట గంజాయి అమ్మకాలు జరుపుతున్న పర్ల సురేష్ అనే వ్యక్తిని పట్టుకొని అతడి వద్ద నుంచి 320 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని, నిందితులను ఘట్కేసర్ ఎక్సైజ్ స్టేషన్ లో అప్పగించినట్లు సీఐ సుబాష్ చంద్రర్ తెలిపారు.



