గిరిజనుల సమస్యల పై ప్రభుత్వం తో పోరాటం చేయాలి

WhatsApp Image 2024-07-24 at 11.08.59_d2135776
విశ్వంభర, కడ్తాల్, జూలై 23 : - తెలంగాణలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని సేవాలాల్ సేన రాష్ట్ర అధ్య క్షుడు ఆంగోత్ రాంబాబునాయక్ డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ గిరిజనులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ, వచ్చే నెల 9న హైదరాబా ద్ లో 'సేవాలాల్ సేన రాష్ట్ర మహాసభను' ' నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. మంగళ వారం కడ్తాల్ మండల కేంద్రంలోని ఎంబీఏ గార్డెన్స్లో సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షుడు నరేశ్నాయక్ ఆధ్వర్యంలో, ఏర్పాటు చేసిన సన్నాహాక సమావేశానికి ఆయన ముఖ్యఅతి థిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ పెంపునకు సంబంధించిన జీవో 33కి చట్టబద్ధత కల్పించాలని. ఏజెన్సీ ప్రాంతంలో రద్దు చేసిన జీవో 3ను వెంటనే పునరుద్ధరించాలని పేర్కొన్నారు. నూతనంగా ఏర్పాటైన గిరిజన పంచాయతీలను రెవెన్యూ గ్రామాలుగా గుర్తించి, తండాల అభివృద్ధికి ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా కేంద్రాల్లో ఐటీడీఏలను ఏర్పాటు చేయాల న్నారు. అనంతరం మహాసభకు సంబంధిం చిన వాల్పోస్టర్లు, కరపత్రాలను ఆవిష్కరిం చారు. సమావేశంలో రాష్ట్ర కో కన్వీనర్ రఘు రాంరాథోడ్, జిల్లా అధ్యక్షుడు నరేష్ నాయక్, ఉపాధ్యక్షుడు కిషన్నాయక్, నాయకులు భీంలాల్ నాయక్, లక్పతినాయక్, జగన్నా యక్, బలరాంనాయక్, శ్రీను, రమేశ్, లక్ష్మణ్, రవి, మోతిలాల్, రాజు పాల్గొన్నారు.

WhatsApp Image 2024-07-24 at 11.09.23_dd515189