ఓటరు జాబితాను పకడ్బందీగా రూపొందించాలి

ఓటరు జాబితాను పకడ్బందీగా రూపొందించాలి

  • : రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి

విశ్వంభర, సంగారెడ్డి : ఓటరు జాబితాను ఎలాంటి తప్పిదాలకు అవకాశం లేకుండా పారదర్శకంగా, పకడ్బందీగా రూపొందించేందుకు ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్ ) ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి, అదనపు ప్రధాన ఎన్నికల అధికారి వాసం వెంకటేశ్వర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఈఆర్వోలు, ఏఈఆర్వోలు, బీఎల్ఓ సూపర్వైజర్లకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్‌ఐఆర్ ప్రక్రియ నిర్వహణ, ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, ఓటర్ల ధృవీకరణ, ఇంటింటి పరిశీలన తదితర అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా శిక్షణ, అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా సీఈఓ సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, భారత ఎన్నికల సంఘం నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం ఎస్‌ఐఆర్ ప్రక్రియను పారదర్శకంగా, సమయపాలనతో నిర్వహించాలని సూచించారు.ఎన్యూమరేషన్ ఫారాలను ఓటర్లకు అందజేసిన అనంతరం సంబంధిత బీఎల్ఓలు ప్రతి ఇంటిని కనీసం మూడుసార్లు సందర్శించి, ఓటర్ల నుంచి డిక్లరేషన్ స్వీకరించాలని తెలిపారు.ఎన్యూమరేషన్ ఫారాలు నింపడం, ఓటర్ల వివరాల పరిశీలన, అవసరమైన పత్రాల ధృవీకరణ తదితర అంశాలపై బీఎల్ఓలకు ఈఆర్వోలు సమగ్ర శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు.అలాగే రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి, బూత్ లెవల్ ఏజెంట్ల నియామక ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో సంగారెడ్డి జిల్లా నుంచి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్లు సంగీత, పాండు, సబ్ కలెక్టర్ ఉమాహారతి, ఈఆర్వోలు, ఏఈఆర్వోలు, బీఎల్ఓ సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.

🕒 30 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/the-voter-list-should-be-prepared-in-full/article-16087

Tags: