టీయూడబ్ల్యుజే ఐ జే యు సభ్యత్వానికి జిల్లాలో విశేష స్పందన

  • చలసాని శ్రీనివాసరావు  ల ఆధ్వర్యంలో ముమ్మరంగా సభ్యత్వ నమోదు

విశ్వంభర, సూర్యాపేట: మీడియా రంగంలోని  99 శాతం  జర్నలిస్టులకు వృత్తి భద్రత కల్పిస్తూ జర్నలిజం విలువలను పరిరక్షించడంలో టీయూడబ్ల్యూజే ఐజేయు అగ్ర భాగాన ఉంటుందని టి యు డబ్ల్యూ జే ఐజేయు సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి, జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు డాక్టర్ కృష్ణ బంటు చెప్పారు. ఐజేయు జాతీయ కార్యవర్గ సభ్యులు కొణిజేటి సత్యనారాయణ, టీయూడబ్ల్యూజే ఐజేయు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు చలసాని శ్రీనివాసరావు ల ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లాలో గత రెండు వారాలుగా ముమ్మరంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం లో భాగంగా శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో పలువురు జర్నలిస్టులకు సభ్యత్వం ఇచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న పలు రకాల సమస్యలను పరిష్కరించడంలో టీయూడబ్ల్యూజే ఐజేయు ముందుంటుందని స్పష్టం చేశారు. జర్నలిస్టుల సంక్షేమం, అభివృద్ధి విషయంలో ఎక్కడా కూడా రాజీ పడకుండా యూనియన్ జాతీయ, రాష్ట్ర నాయకత్వం అహర్నిశలు కృషి చేస్తుందని వెల్లడించారు. జర్నలిస్టులకు మొట్టమొదటిసారిగా అక్రిడిటేషన్, బస్సు పాస్ సౌకర్యం కల్పించిన ఘనత టీయూడబ్ల్యూజే ఐజేయుది అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కూడా 33 జిల్లాలలో మెజార్టీ అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు తమ యూనియన్ పక్షాన ఉన్నారని, వారందరూ కూడా అర్హులైన జర్నలిస్టులు అందరికీ అక్రిడిటేషన్లు అందాలనే ఉద్దేశంతో అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారని వివరించారు. జర్నలిస్టులకు హెల్త్ కార్డులు, ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇప్పించడమే కాకుండా వృత్తిలో నైపుణ్యం పెంపొందించుకోవడానికి శిక్షణ కార్యక్రమాలు చేపట్టిన ఘనత కూడా టీయూడబ్ల్యూజే ఐజేయు దే అనే వెల్లడించారు. జర్నలిస్టులు అందరూ కూడా తమకు అవసరమైన అండగా ఉండే సంఘమేదో గుర్తుంచుకొని టీయూడబ్ల్యూజే ఐజేయులు సభ్యులుగా చేరుతున్నారని చెప్పారు. ఒక శాతం జర్నలిస్టులకు కూడా ప్రాతినిధ్య వహించని కొన్ని గుర్తింపు లేని సంఘాలు, జర్నలిస్టుల నమ్మకాన్ని కోల్పోయిన సంఘాల విమర్శలకు టియుడబ్ల్యూజే ఐజేయు అదరదు, బెదరదు అని స్పష్టం చేశారు. వార్ వన్ సైడ్ అయిపోయిందని, జర్నలిస్టులు అందరూ కూడా టీయూడబ్ల్యూజే ఐజేయు పక్షాన ఉన్నారని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో టి యు డబ్ల్యూ జే ఐజేయు ఎలక్ట్రానిక్ మీడియా సూర్యాపేట జిల్లా అధ్యక్షులు బత్తుల మల్లికార్జున్, జిల్లా నాయకులు పులుసు నాగరాజు, తండు వెంకన్న, కందుకూరి యాదగిరి, షేక్ రషీద్, రామకృష్ణ, దుస్స చంద్రశేఖర్,, గుంటి శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టులు  వల్లపట్ల రవి, సాంబ చారి, అనంతుల శ్రీనివాస్ గౌడ్, చెరుకు శ్రీనివాస్, గుండేటి సత్యనారాయణ,  దేసోజు రవి, తప్సీ అనిల్ కుమార్, మధు తదితరులకు సభ్యత్వం అందజేశారు.

🕒 30 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/there-is-a-remarkable-response-in-the-district-to-the/article-16085

Tags: