తాపీ మేస్త్రి ఆత్మ గౌరవ సభను విజయవంతం చేయాలి
విశ్వంభర, రాజేంద్రనగర్: తాపీ మేస్త్రీలను అణగదొక్కాలని చూస్తున్నారని ఇది ఎంత మాత్రం సమంజసం కాదని శంషాబాద్ మండలం తాపీ మేస్త్రీల సంఘం నాయకులు ధ్వజమెత్తారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ పురపాలక పరిధిలో శుక్రవారం భవన నిర్మాణం తాపీ మేస్త్రీల సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తాపీ మేస్త్రీల సంఘం నాయకులు మాట్లాడుతూ జూన్ 8న సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తాపీ మేస్త్రీల ఆత్మగౌరవసభను విజయవంతం చేయాలని వారు అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భవన నిర్మాణం కావాలంటే తాపీ మేస్త్రిలే ప్రధాన వ్యక్తులని మే 16న సెంట్రింగ్ కాంట్రాక్టర్స్ పనులు బంద్ పెట్టి తాపీ మేస్త్రి హటావో సెంట్రింగ్ కాంట్రాక్టర్స్ బచావో తాపీ మేస్త్రి మధ్యవర్తుల దళారుల అనే నినాదంతో సమ్మెను కొనసాగిస్తున్నారని తోటి కార్మికులను అవమానపరిచే విధంగా తాపీ మేస్త్రీల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వారి రేట్ పెంచుకోవడం ప్రభుత్వ నుండి వచ్చే సంక్షేమ పథకాల కోసం సమ్మె జరిగితే ఎవరికీ ఇబ్బంది లేదని కానీ తాపీ కార్మికుని కించపరుస్తూ గుండు దారం పట్టుకొని వచ్చి మా మీద పెత్తనం చేస్తున్నారని సోషల్ మీడియాలో ప్రచారం చేయడం ఇది దారుణం అన్నారు. గృహ నిర్మాణదారుడు కేవలం సెంట్రింగ్ పని స్లాబ్ వేసే వరకు పని చేసే వ్యక్తిని ఇంటి యజమాని ఎట్లా ఎంపిక చేసుకుంటాడు చేసుకుంటే తాపీ మేస్త్రి కి ఎలాంటి ఇబ్బంది లేదు కానీ గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తరుముకున్నట్టుంది యజమాని పని ఇవ్వకపోతే తాపీ మేస్త్రి తప్పు అవుతదా అని అన్నారు. తాపీ మేస్త్రి సెంట్రింగ్ మేస్త్రి పని విడదీయరాని బంధం లాంటిది రెండు రంగాలకు అవినాభావ సంబంధం ఉంది అనేది గుర్తు చేసుకోవాలన్నారు. సెంట్రింగ్ కాంట్రాక్ట్ సమ్మె రేట్ల కోసమే అయితే తాపీ మేస్త్రి సంఘాలను సంప్రదించినారా లేదా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘాలను సంప్రదించారా? అని అన్నారు. ఓవైపు కార్మిక వర్గ పోరాటాలు ప్రపంచ కార్మికులారా ఏకంకండి అని నినాదం ఇస్తే మీరు మాత్రం కార్మికులను విడదీయాలని చూస్తున్నారని ఇది పెట్టుబడిదారీ దురహంకారం అన్నారు.సమ్మె నిర్వహించాలంటే ముందుగా సంబంధిత కమిటీలకు, తాపి మేస్త్రీలకు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం ఉందని వారు పేర్కొన్నారు. అయితే అలాంటి సమాచారమేమీ ఇవ్వకుండా, కొంతమంది స్వయంగా నిర్ణయాలు తీసుకుని సమ్మెకు వెళ్లడం సరైన విధానం కాదన్నారు.ఈ సమ్మె నిజంగా కార్మికుల కూలీ రేట్ల కోసం జరుగుతుందా? లేక ప్రభుత్వ పథకాల కోసం జరుగుతుందా? అనే సందేహాలను వారు వ్యక్తం చేశారు.మేము కార్మికులకు పని కల్పిస్తే దళారులమా ? కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తే మమ్మల్ని తప్పుగా చూపడం ఎందుకు?” అని తాపీ మేస్త్రీలు ప్రశ్నించారు. భవన నిర్మాణ రంగంలో పదిరకాల కార్మికులు ఉన్నప్పటికీ, అందులో ప్రధాన పాత్ర కాపీ మేశ్రిదేనని వారు పేర్కొన్నారు. తాపీ పని పూర్తయితేనే భవన నిర్మాణానికి పునాది పడుతుందని గుర్తు చేశారు. తాపీ మేస్త్రీల పాత్రను తగ్గించి మాట్లాడడం అన్యాయమని అన్నారు. “ఒక భవనం అందంగా, బలంగా నిర్మాణం కావాలంటే ప్రతి కార్మికుడి శ్రమ అవసరం” అని స్పష్టం చేశారు. కూలీల విలువను తగ్గించేలా వ్యవహరిస్తున్నారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల గౌరవాన్ని కాపాడాలని, కాపీ కార్మికులపై అనుచిత వ్యాఖ్యలు చేయవద్దని హెచ్చరించారు. తాపీ మేస్త్రి భవన నిర్మాణ రంగంలో పెద్దన్న పాత్ర పోషిస్తున్నాడని ఇంటి ఓనర్ కూడా చివరిదాకా పని చేయించుకుని డబ్బులు ఎగ్గొట్టిన సందర్భాలు ఉన్నాయని అయినా సెంట్రింగ్ కార్మికులకు స్లాబ్ పడంగానే వెంటనే డబ్బులు ఇచ్చి పంపించే మంచి మనసున్న వ్యక్తి తాపీ మేస్త్రి ఒక్కడే అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాకుడు సుర వెంకటయ్య గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు, ముఖ్య అతిధులు కామల్ల ఐలన్న రాష్ట్ర అధ్యక్షులు, ఉప్పు సాయికుమార్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తాటికొండ మధు కోశాధికారి, మెరుగు యాదగిరి రాష్ట్ర ఉపాధ్యక్షులు, చొక్కాపురం శ్రీరాములు మేడ్చల్ జిల్లా అధ్యక్షులు, శంషాబాద్ మండలం బండ్లమూడి భాస్కర్ ఉపాధ్యక్షులు, గుడిపూడి చెంచు నాయుడు ఉపాధ్యక్షులు, మామిడి కొండలరావు ట్రెజరర్, పల్నాటి ఏడుకొండలు, రామాంజనేయులు, టి రమేష్ పటాన్చెరువు, ఏడుకొండలు తుర్కయంజాల్, మాలాద్రి బి.యన్.రెడ్డి, ఎం కాశీ గచ్చిబౌలి, మహేష్ శంషాబాద్, రమేష్ నాయక్ తుక్కుగూడ, టి తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.