ప్రమాద రహిత సురక్షిత జిల్లాగా మార్చడమే లక్ష్యం 

  •  జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ 

విశ్వంభర, సూర్యాపేట: పరిశ్రమల్లో పనిచేసే కార్మికుల ప్రాణ రక్షణే ప్రథమ ప్రాధాన్యతగా భావించి జిల్లాలో 'సున్నా ప్రమాదాలు'  లక్ష్యంతో  భద్రతా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సూచించారు. జిల్లాలో పారిశ్రామిక ప్రమాదాల నివారణ, అత్యవసర పరిస్థితుల సమర్థవంతమైన ఎదుర్కొనేందుకు  సూర్యాపేట జిల్లా కలెక్టరేట్‌లో ‘డిస్ట్రిక్ట్ క్రైసిస్ గ్రూప్’ ఉన్నత స్థాయి సమావేశం శుక్రవారం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా స్థాయి అధికారులు, ప్రముఖ పరిశ్రమల ప్రతినిధులు, వైద్య నిపుణులు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని మేజర్ యాక్సిడెంట్ హజార్డ్  ఫ్యాక్టరీలు తమ సంస్థల పరిధిలోని ఆన్-సైట్ ఎమర్జెన్సీ ప్లాన్లను ప్రభుత్వానికి సమర్పించాలని  ఆదేశించారు. ప్రమాదాలు జరిగినప్పుడు తక్షణమే స్పందించేలా పరిశ్రమలు, జిల్లా యంత్రాంగం, ఫైర్ సర్వీసులు, పోలీస్, వైద్య, రవాణా శాఖల మధ్య సమర్థవంతమైన సమన్వయ వ్యవస్థను ఏర్పాటు చేయలన్నారు. జిల్లాలో   ప్రభుత్వ అధికారులు పరస్పర సహకారంతో బాధ్యతాయుతంగా పనిచేసి, సూర్యాపేటను ప్రమాదాలు లేని సురక్షితమైన జిల్లాగా తీర్చిదిద్దాలని తెలిపారు. భద్రతా నియమాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ  సమావేశంలో అదనపు కలెక్టర్ బి హరి సింగ్, అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి , ఫైర్ శాఖ డీఎఫ్‌ఓ, రవాణా శాఖ ఆదిత్య అధికారులు, డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్  కె.వి. శ్రీదేవి, వివిధ పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు.

🕒 30 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/the-aim-is-to-make-it-a-safe-and-accident-free/article-16077

Tags: