శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో రష్మీ ఠాకూర్ కు ఘన స్వాగతం
విశ్వంభర, రాజేంద్రనగర్: మిస్ ఆసియా ఇంటర్నేషనల్, తెలంగాణ హ్యాండ్లూమ్స్ బ్రాండ్ అంబాసడర్ రష్మి ఠాకూర్‌కు హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. ఫ్రాన్స్‌లో జరిగిన ప్రతిష్టాత్మక 79వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రపంచ వేదికపై తొలిసారిగా పోచంపల్లి ఇకత్ హ్యాండ్లూమ్‌ను ప్రదర్శించి చరిత్ర సృష్టించిన అనంతరం ఆమె భారత్‌కు చేరుకున్నారు. ఈ ఘన స్వాగత కార్యక్రమాన్ని పోచంపల్లి హ్యాండ్లూమ్ టై అండ్ డై సిల్క్ సారీస్ మాన్యుఫాక్చరర్స్ ట్రస్ట్ పోచంపల్లి ప్రొడక్షన్ హ్యాండ్లూమ్స్ అండ్ హ్యాండిక్రాఫ్ట్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో, ట్రస్ట్ చైర్మన్, ప్రొడ్యూసర్ కంపెనీ సీఈఓ శ్రీ తడక రమేష్ నేతృత్వం నిర్వహించారు. తెలంగాణకు చెందిన 200 ఏళ్ల పోచంపల్లి నేయ్యాల వారసత్వాన్ని ప్రపంచ వేదికపై నిలబెట్టిన రష్మి ఠాకూర్‌ను అభినందించేందుకు సుమారు 30 మంది నేతన్నలు, కళాకారులు, హ్యాండ్లూమ్ రంగ ప్రతినిధులు శంషాబాద్ విమానాశ్రయంలోని ఇంటర్నేషనల్ అరైవల్స్ వద్ద హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో పోచంపల్లి కార్మిక సంఘం అధ్యక్షుడు అంకం పాండు, ఎల్‌బీ నగర్ చెనేత సంఘం సభ్యులు, మహిళా నేతన్నలు తడక రాజిని, గుర్రం హేమలత, అంకం కవిత, గుండు జ్యోతి, ఎలగందల చందనతో పాటు మరెందరో నేత కళాకారులు పాల్గొన్నారు.కేన్స్ ఫెస్టివల్‌లో రష్మి ఠాకూర్ ధరించిన ప్రత్యేక దుస్తులు తెలంగాణ మాస్టర్ వీవర్స్ చేతులతో నేసిన అసలైన పోచంపల్లి ఇకత్‌తో రూపొందించబడ్డాయి. “పోచంపల్లి టు కేన్స్” అనే థీమ్‌తో రూపొందించిన ఈ దుస్తులు భారతదేశానికి చెందిన జియోగ్రాఫికల్ ఇండికేషన్ గుర్తింపు పొందిన హ్యాండ్లూమ్ సంప్రదాయాన్ని ప్రపంచానికి పరిచయం చేశాయి.ఈ ప్రత్యేక వస్త్రాల అందాన్ని మరింత పెంచుతూ హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపైన నిజాం కాలం హైదరాబాదీ ముత్యాలు అలంకరించబడ్డాయి. భారతీయ వస్త్ర సంపద, ఆభరణాల వారసత్వానికి ఇది ప్రతీకగా నిలిచింది.ఈ సందర్భంగా రష్మి ఠాకూర్ మాట్లాడుతూ, “ఈ స్వాగతం పోచంపల్లి ప్రతి నేతన్నకు చెందింది. తరతరాలుగా ఈ కళను కాపాడిన వారి కృషికి ఇది గుర్తింపు. కేన్స్ వేదికపై తెలంగాణ భారతీయ హ్యాండ్లూమ్‌ను ప్రాతినిధ్యం వహించడం నా వ్యక్తిగత విజయమే కాదు, మన నేతన్నలందరికీ గర్వకారణం” అని అన్నారు.తడక రమేష్ మాట్లాడుతూ, “పోచంపల్లి ఇకత్‌ను కేన్స్ వేదికపై ప్రపంచానికి పరిచయం చేసి రష్మి ఠాకూర్ చరిత్ర సృష్టించారు. ఇది తెలంగాణ నేతన్నలకు, భారతీయ హ్యాండ్లూమ్ రంగానికి గర్వకారణం. ఆమె ద్వారా ప్రపంచానికి పోచంపల్లి ఇకత్ అందం, నైపుణ్యం, వారసత్వం తెలిసింది” అని అన్నారు.ఈ కార్యక్రమానికి సహకరించిన భారత ప్రభుత్వం, డెవలప్‌మెంట్ కమిషనర్ ఆఫ్ హ్యాండ్లూమ్స్, తెలంగాణ ప్రభుత్వం, వీవర్స్ సర్వీస్ సెంటర్ హైదరాబాద్, అరుణ్ కుమార్, పోచంపల్లి ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్‌కు రష్మి ఠాకూర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.కేన్స్ ఫెస్టివల్‌లో పోచంపల్లి ఇకత్‌కు లభించిన ఈ అంతర్జాతీయ గుర్తింపు భారతీయ హ్యాండ్లూమ్ రంగానికి ఒక చారిత్రాత్మక మైలురాయిగా భావిస్తున్నారు. దీని ద్వారా తెలంగాణ నేయ్యాల వారసత్వానికి ప్రపంచవ్యాప్తంగా మరింత గుర్తింపు లభించే అవకాశం ఉందని నేతన్నలు ఆశాభావం వ్యక్తం చేశారు.