గుర్తు వివాదంపై నిరసన
విశ్వంభర, చిక్కడపల్లి : ఎన్నికల్లో ఓటమి భయంతో గుర్తు మార్చడం అన్యాయమని కామ్ ఘర్ యూనియన్ అధ్యక్షుడు రాంబాబు, అసోసియేట్ అధ్యక్షుడు నారాయణ అన్నారు. హెచ్ ఎం డబ్ల్యు ఎస్ ఎస్ బి వాటర్ వర్క్స్ ఎన్నికల నేపథ్యంలో గుర్తు కేటాయింపుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ హైదరాబాదు చిక్కడపల్లి లేబర్ కమిషనర్ కార్యాలయం ముందు బిఆర్ టియు అనుబంధ కామ్ ఘర్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. గత నాలుగు దఫాలుగా బాణం గుర్తుపై పోటీ చేసి పలుమార్లు విజయం సాధించిన తమ యూనియన్‌కు నిబంధనలకు విరుద్ధంగా ఈసారి చక్రం గుర్తు కేటాయించారని ఆరోపించారు. కాంగ్రెస్, ఐఎన్టియుసి కలిసి అధికార బలంతో ఈ నిర్ణయం తీసుకున్నాయని విమర్శించారు. దీనిపై ఆందోళనగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. నిరసన సందర్భంగా ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. చిక్కడపల్లి ఏసీపీ జి.రణవీర్ రెడ్డి, సీఐ మల్లేశం ఆధ్వర్యంలో రాంబాబు సహా పలువురు నిరసనకారులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం నారాయణ మాట్లాడుతూ తమ యూనియన్‌కు పూర్వపు గుర్తునే కేటాయించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సెక్రటేరియట్, ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఎల్లమయ్య, అసోసియేట్ ప్రెసిడెంట్ మేడ్చల్ శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, వెంకటేష్, అడ్వైజర్ లక్ష్మణ్ కుమార్, ఖలీల్, రామరాజు తదితరులు పాల్గొన్నారు.