నిజం కాలం నాటి పాత సింగూర్ డ్యాములు పరిశీలించిన ఎమ్మెల్యే

  • రాయిపల్లి శివారులో బయతపడ్డ పురాతన డ్యాం

విశ్వంభర, పెద్ద శంకరంపేట:  నారాయణఖేడ్  నియోజకవర్గ పరిధిలోని మానూర్ మండలం  రాయిపల్లి గ్రామ శివారులో సింగూర్ ప్రాజెక్టు మరమ్మతు పనుల నేపథ్యంలో నీటిని దిగువకు విడుదల చేయడంతో, నిజాం పాలన కాలంలో నిర్మించిన ఒక అరుదైన పురాతన డ్యాం (ఆనకట్ట) పైకి తేలింది. ఈ విషయం తెలుసుకున్న  నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి శుక్రవారం పురాతన డ్యాం ప్రాంతాన్ని స్వయంగా సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  డ్యాం నిర్మాణ శైలిని, దాని ప్రస్తుత స్థితిగతులను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం అక్కడి రైతులు, స్థానిక ప్రజలతో సమావేశమై డ్యాంకు సంబంధించిన చారిత్రక, సాంకేతిక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ పాత డ్యాం ఆధారంగా నిలిచే నీటి నిల్వ సామర్థ్యం, స్థానిక వ్యవసాయానికి జరిగే మేలు తదితర వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ పురాతన డ్యాం నిర్మాణాన్ని బేస్ (ఆధారం) చేసుకుని, ఇక్కడ సరికొత్త సాంకేతికతతో కూడిన నూతన డ్యామ్ లేదా అత్యాధునిక "రబ్బర్ డ్యాం" నిర్మాణం చేపడితే ఎలా ఉంటుందనే ఆలోచనను ఎమ్మెల్యే  వ్యక్తపరిచారు. దీనిపై ఆయన నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో తక్షణమే ఫోన్ లో మాట్లాడారు. ఇక్కడ లభ్యమైన పురాతన డ్యాం విశేషాలను, దాని భౌగోళిక ప్రాధాన్యతను అధికారులకు వివరించారు. ఈ ప్రాంతంలో కొత్త డ్యాం లేదా రబ్బర్ డ్యాం నిర్మాణానికి ఉన్న సాధ్యసాధ్యాలపై సమగ్ర సాంకేతిక సర్వే నిర్వహించి, నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి  మాట్లాడుతూ నిజాం కాలం నాటి ఈ పురాతన డ్యాం బయటపడటం ఈ ప్రాంత రైతులకు ఒక మంచి పరిణామం. ఈ పాత నిర్మాణాన్ని ఉపయోగించుకుంటూ ఇక్కడ నూతన డ్యామ్ లేదా రబ్బర్ డ్యాం నిర్మిస్తే, చుట్టుపక్కల వందలాది ఎకరాలకు సాగునీరు అందడమే కాకుండా భూగర్భ జలాలు భారీగా పెరుగుతాయి.అని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, నీటిపారుదల శాఖ స్థానిక సిబ్బంది, మరియు రాయిపల్లి గ్రామ రైతులు, ప్రజలు పాల్గొన్నారు.

🕒 30 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/mla-who-inspected-the-old-singur-dams-of-nijar-period/article-16095

Tags: