సహజ పద్దతిలో యోగా చేయడం మేలు. -ప్రొఫెసర్ డా. శ్రీకాంత్ బట్
విశ్వంభర, హైదరాబాద్ :- ఆహార నియమాలు పాటిస్తూ జీవన విధానాన్ని మార్చుకుని ప్రకృతి తో మమేకమై జీవించాలని, బరువు తగ్గాలనే ఆత్రుతతో ఇంజక్షన్ తీసుకుని బరువు తగ్గుతున్నారు. అది ఆరోగ్యానికి మంచిది కాదు. సహజ పద్దతిలో యోగా చేయడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అని ప్రొఫెసర్ డా. శ్రీకాంత్ బట్ అన్నారు. భారతీయ యోగా సంస్తాన్ ఆధ్వర్యంలో వినాయక్ నగర్ కాలనీ కమ్యూనిటీ హాల్ లో స్థూలకాయ వ్యాధి నివారణ రెండో రోజు శిభిరానికి ఆయన ముఖ్య అతిధి గా హాజరై జంక్ ఫుడ్ తినడం వల్ల శరీరానికి జరిగే హాని గురించి వివరించారు. ప్రజల బలహీనతను ఆసరా చేసుకుని మార్కెటింగ్ మాఫియా పనిచేస్తుందని అందరం జాగ్రత గా ఉండాలని యోగా సాధన ద్వారానే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఒక డాక్టర్ గా సలహా ఇస్తున్న అని ఆయన చెప్పారు.ఈ కార్యక్రమంలో 50 మంది యోగా సాధికా, సాధకులు పాల్గొన్నారు. స్తూలకాయ వ్యాధి నివారణకు వేయాల్సిన యోగా ఆసనాలు సాధన చేయించి వాటి వల్ల కలిగే ఫలితాలు, ప్రయోజనాలని తూర్పు జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వరు వివరించి సాధన చేయించారు. ఈ కార్యక్రమం లో వినాయక్ నగర్ కాలనీ యోగా సెంటర్ సాధకులతో పాటు, ఎల్లారెడ్డి కాలనీ యోగా సెంటర్ సాధకులు, రాజరాజేశ్వరి కాలనీ సెంటర్ యోగా సాధకులు పాల్గొన్నారు. ముఖ్యంగా దాదాపు 35 మంది మహిళా సాధకులు పాల్గొన్నారు. తూర్పు జిల్లా సెక్రటరీ ప్రభాకర్ , జోనల్ chiefs, సెక్రటరీ లు సెంటర్ ఇంచార్జెస్, మరియు యోగా శిక్షకులు కృష్ణ మోహన్ , విజయకుమార్ పాల్గొన్నారు. మూడు సెంటర్ల జోనల్ చీఫ్ అయిన వేణుగోపాల్ రెడ్డి అండదండలతో పాటు, వినాయక్ నగర్ కాలనీ అధ్యక్షులు కళ్లెం శంకర్ రెడ్డి సహకారం తో ఈ కార్యక్రమం రెండో రోజు విజయవంతగా ముగిసింది.