డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు.. 47 మంది పట్టివేత

విశ్వంభర, కాచిగూడ : కాచిగూడ ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 47 మంది పట్టుబడ్డారు. అంబర్‌పేట్ పరిధిలో నిర్వహించిన తనిఖీల్లో పట్టుబడిన వారికి నాంపల్లిలోని ఎనిమిదవ జేఎంఎఫ్‌సీ కోర్టు జరిమానాలు, జైలు శిక్షలు విధించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మొత్తం 47 కేసుల్లో 42 మందికి రూ. 2,22,700 జరిమానా విధించారు. వీరిలో 38 మందికి ఒక్కొక్కరికి రూ. 5,100 చొప్పున, నలుగురికి రూ. 7,100 చొప్పున కోర్టు ఫైన్ విధించింది. మరో ఐదుగురికి రూ. 100 జరిమానాతో పాటు ఒక్కొక్కరికి తొమ్మిది రోజుల జైలు శిక్ష విధించారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌పై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తామని, ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.

🕒 30 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/drunk-and-drive-checks-resulted-in-47-arrests/article-16100

Tags: