లైసెన్స్ ఉంటేనే ఎరువులు అమ్మాలి 

లైసెన్స్ ఉంటేనే ఎరువులు అమ్మాలి 

విశ్వంభర, పెద్ద శంకరంపేట:   డీలర్లు లైసెన్సులు ఉంటేనే ఎరువులు అమ్మాలని, లైసెన్సులు లేని డీలర్ల పై చట్టరీత్యా చర్యలు తీసు కొంటామని మండల తాసిల్దార్ ప్రభుదాస్ మండల వ్యవసాయ అధికారి నాగం కృష్ణ అన్నారు.  జిల్లా కలెక్టర్,  జిల్లా వ్యవసాయ అధికారి ఆదేశాల మేరకు  పెద్ద శంకరపేట్ మండలంలో శుక్రవారం మండల టాస్క్ఫోర్స్ టీం ఎరువుల దుకాణాలను  గ్రోమోర్, జగదాంబ  ఇతర ఎరువుల దుకాణాలను   మండల తహసిల్దార్ ప్రభుదాస్ మం డల వ్యవసాయ అధికారి  నాగం కృష్ణ,  ఏఎస్ఐ చంద్రమోహన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు  డీలర్లుఎరువుల దుకాణాల  లైసెన్సులు కలిగి ఉండాలని లైసెన్సుల చివరి తేదీ రాకముందే రెన్యువల్ చేసుకోవాలని హెచ్చరించారు. ఎరువులు పక్కదారి పట్టకుండా రైతులకు సరైన క్రమంలో అమ్మకాలు జరపాలని సూచించారు ఎరువుల సరుకు నిలువ( స్టాక్) రిజిస్టర్లు అనగా యూరియా డి ఏ పి కాంప్లెక్స్ పొటాష్ తదితర ఎరువుల రిజిస్టర్లు తేదీ వారిగా తప్పకుండా నమోదు చేయాలని అలాగే ఈపాస్ మెషిన్ లో స్టాక్ ఎప్పటికప్పుడు క్లియరెన్స్ చేయాలని తహసిల్దార్ ప్రభుదాస్ అన్నారు. ఎలాంటి బ్లాక్ మార్కెటింగ్ గాని ఎరువుల డైవర్స్ కేసర్ గాని అధిక ధరలకు విక్రయించడం జరిగినచో ఎసెన్షియల్ కమోడిటీ యాక్ట్  ఫర్టిలైజర్ కంట్రోల్ ఆర్డర్ ప్రకారము వారిపై చట్టరీత్యా కేసులు నమోదు చేస్తామనీ హెచ్చరించారు. స్టాక్ బోర్డులో ఎప్పటికప్పుడు వివరాలు పొందుపరచాలని హెచ్చరించచారు రైతులకు యూరియా సరఫరా లో బిల్లులు తప్పనిసరిగా రైతులకు ఇవ్వాలని పేర్కొన్నారు యూరియా డిఏపి కాంప్లెక్స్ పొటాష్ ఎరువులు సరైన విధానంలో గాలి వెలుతురు సక్రమంగా ఉన్న గోడౌన్లలో నిల్వ ఉంచి వాటి నాణ్యత పాడవకుండా చూసి రైతులకు సరఫరా చేయాలని మండల వ్యవసాయ అధికారి నాగం కృష్ణ సూచించారు.

🕒 30 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/fertilizers-should-be-sold-only-with-a-license/article-16116

Tags: