మహిళను ఇబ్బంది పెడుతున్న సర్పంచ్ పై కఠిన చర్యలు తీసుకోవాలి 

  • : సిపిఎం డిమాండ్

విశ్వంభర,  వలిగొండ: యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలో ఆరూరు గ్రామంలో మహిళను ఇబ్బంది పెడుతున్న సర్పంచ్ పై చర్యలు తీసుకోవాలని సిపిఎం  నాయకులూ డిమాండ్ చేసారు. అరూర్ గ్రామానికి చెందిన దళిత మహిళ బూడిద మనమ్మ పై గత కాలంగా వ్యక్తిగత కక్ష పెంచుకొని తీవ్రమైన ఇబ్బందులకు గురిచేస్తున్న సర్పంచ్ సుక్క ముత్యాలు పై తక్షణమే చర్యలు తీసుకోవాలని సిపిఎం ఆధ్వర్యంలో స్థానిక ఎంపీడీవో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి అనంతరం ఎంపీడీవోకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి సిర్బంగి స్వామి, మండల కమిటీ సభ్యులు గాజుల ఆంజనేయులు  మాట్లాడుతూ, అరూరు గ్రామంలో తన తల్లిదండ్రుల నుండి భరణంగా లభించిన ప్లాట్లు లో ఇంటి నిర్మాణం చేసుకోవడానికి సుమారు మూడు సంవత్సరాల నుంచి పర్మిషన్ కోసం దరఖాస్తులు పెట్టుకున్న స్థానిక పంచాయతీ కార్యదర్శి, ప్రస్తుత సర్పంచ్ గా ఉన్న సుక్క ముత్యాలు పర్మిషన్ ఇవ్వకుండా ఆమెపై వ్యక్తిగతంగా దూషణలకు పాల్పడుతూ గత కొంతకాలంగా తీవ్రమైన ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఇప్పటికే ఇంటి నిర్మాణం కోసం స్థానిక ఎంపీడీవో కార్యాలయం, డిపిఓ, డి ఎల్ పి ఓ, జిల్లా కలెక్టర్ కు అనేక దరఖాస్తులు పెట్టుకున్నప్పటికీ పర్మిషన్ ఇవ్వకుండా ఉద్దేశపూర్వకంగా వ్యవహరిస్తూ మహిళపై అనేక రకాల ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఆరోపించారు.  గత నాలుగు రోజుల క్రితం ఆమె స్థలంలో మహిళా సంఘం భవనం నిర్మాణం కోసం అక్రమంగా ముగ్గు పోశారని వెంటనే ఇప్పటికే పై స్థాయి అధికారుల విచారణలో ఉన్న తన ఇంటి స్థలం విషయంలో అక్రమ నిర్మాణం చేపట్టకుండా నిలుపుదల చేయాలని వినతి పత్రం అందజేశారు. అదేవిధంగా ఒక మహిళపై వ్యక్తిగత దూషణలకు పాల్పడుతూ అనేక మందిని ప్రోత్సహిస్తూ దాడులకు పాల్పడుతున్న స్థానిక సర్పంచ్ సుక్క ముత్యాలపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు రేఖల లక్ష్మీనారాయణ, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు వేముల నాగరాజు,నాయకులు చేగురి నగేష్, బాధితులు బూడిద మణెమ్మ,సైదులు,పద్మ,అండాలు, నరసింహ తదితరులు పాల్గొన్నారు.

🕒 30 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/strict-action-should-be-taken-against-the-sarpanch-who-is/article-16089

Tags: