ఘనంగా సావర్కర్ 143వ జయంతి వేడుకలు

ఘనంగా సావర్కర్ 143వ జయంతి వేడుకలు

విశ్వంభర : మానుకోట :-అస్పృశ్యత నిర్మూలనకు అహర్నిశలు పోరాడిన మహనీయుడు వీర్ సావర్కర్ .డా. కందుల నాగరాజు .ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు వినాయక్ దామోదర్ సావర్కర్ 143 వ జయంతి వేడుకలను నేతాజీ సేవా సమితిఆధ్వర్యంలో మానుకోటలో ఘనంగా నిర్వహించారు . ఈ సందర్భంగా  నేతాజీ సేవ సమితి వ్యవస్థాపకుడు డాక్టర్ కందుల నాగరాజు  కార్యక్రమం నీ ఉద్దేశించి  మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుడు వీర సావర్కర్ కేవలం దేశభక్తుడే కాకుండా, భారత స్వాతంత్ర్య ఉద్యమానికి తన యౌవనాన్ని, జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడని, “దేశం కోసం మరణించడం మాత్రమే కాదు, దేశం కోసం జీవితాంతం జీవించి పోరాడిన వ్యక్తి సావర్కర్ అని ,బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా యువతలో దేశభక్తిని రగిలించిన గొప్ప విప్లవకారుడు సావర్కర్ , మరియు  లండన్‌లోని ఇండియా హౌస్ కేంద్రంగా అనేక మంది భారతీయ యువకుల్లో స్వాతంత్ర్య స్పూర్తిని నింపారని, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమాలను బలోపేతం చేశారు అని గుర్తు చేశారు . అంతే కాకుండా ఆయన రచించిన “ది ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ – 1857” గ్రంథం భారత తొలి స్వాతంత్ర్య సమరాన్ని జాతీయ ఉద్యమంగా ప్రపంచానికి పరిచయం చేసింది ,సావర్కర్ ఆలోచనలతో ప్రేరణ పొందిన మదన్ లాల్ ఢింగ్రా వంటి విప్లవకారులు బ్రిటిష్ పాలకులకు ఎదురుదెబ్బ ఇచ్చారు. స్వాతంత్ర్యం కోసం సావర్కర్ అనేక కష్టాలు అనుభవించాడు ,  బ్రిటిష్ ప్రభుత్వం ఆయనకు 50 సంవత్సరాలు శిక్ష విధించి అండమాన్‌లోని సెల్యులర్ జైలుకు పంపింది. అక్కడ అమానుష హింసలు, కఠిన శ్రమ ఎదురైనా ఆయన మనోధైర్యం కోల్పోకుండా సహ ఖైదీలలో దేశభక్తిని నింపుతూ స్వేచ్ఛా భావాలను మరింత బలపరిచాడు.రత్నగిరిలో ఆయన సమాజ సంస్కరణపై ప్రత్యేక దృష్టి పెట్టి  అస్పృశ్యత, అంటరానితనం వంటి సామాజిక దురాచారాల నిర్మూలన కోసం కృషి చేస్తూ హిందూ సమాజ ఐక్యత కోసం అన్ని వర్గాల ప్రజలకు ఆలయ ప్రవేశం కల్పించాలని ఉద్యమం చేస్తూ, “పతిత పావన్ మందిర్” స్థాపించి  తద్వారా సమానత్వ సందేశాన్ని సమాజానికి చాటిచెప్పాడు.అస్పృశ్యత అనేది సమాజాన్ని బలహీనపరిచే దురాచారం అని భావించిన సావర్కర్, సమానత్వం మరియు సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడాడు అని డా. కందుల నాగరాజు  అన్నారు . నేటి యువత ఆయన దేశభక్తి, త్యాగం, సామాజిక సంస్కరణ భావాలను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు . ఈ కార్యక్రమంలో నేతాజీ సేవా సమితి ఉప కార్యదర్శి కుర్యావుల గంగాధర్, ఆర్గనైజింగ్ కన్వీనర్ సామ శ్రీనివాస్, భారత్ వికాస్ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వివి నాగేందర్, ముదిగొండ విశ్వనాథం,జై ప్రకాష్ లోయ, అక్కేర మోహన్‌రావు, చిట్టిమల్ల రఘు, శ్రీరంగం ఉపేందర్, వక్కల శ్రీనివాస్, బొమ్మరాతి భద్రయ్య, చేపూరి విష్ణు ,  తదితరులు పాల్గొన్నారు .

🕒 29 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/celebrating-savarkars-143rd-birth-anniversary/article-16060

Tags: