మాదక ద్రవ్యాల నివారణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం*

విశ్వంభర, శంకర్పల్లి మోకిలా :-పై అధికారుల ఆదేశానుసారం శుక్రవారం మొకిల పోలీస్ స్టేషన్ పరిధిలో ఈగల్ టీమ్ సమక్షంలో మాదక ద్రవ్యాల నివారణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో భాగంగా పోలీసులు చిన్నచిన్న వ్యాపార దుకాణాలు, ప్రజా ప్రదేశాలను సందర్శించి మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాల గురించి ప్రజలకు వివరించారు.అలాగే అక్రమంగా మాదక ద్రవ్యాల విక్రయం, నిల్వ, రవాణా లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా పోలీసు అధికారులకు తెలియజేయాలని దుకాణదారులు, యువత మరియు ప్రజలకు సూచించారు. సమాజంలో మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పోలీసులు కోరారు.ఈ కార్యక్రమంలో మొకిల ఎస్సై సాయి కృష్ణ పోలీస్ సిబ్బంది, ఈగల్ టీమ్ సభ్యులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

🕒 29 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/special-awareness-program-on-drug-prevention/article-16068

Tags: