గుండాలలో ధాన్యం తూకం అక్రమాలపై రైతుల ఆందోళన

  • రోడ్డుపై దాన్యం బస్తాలకు నిప్పుపెట్టి నిరసన

విశ్వంభర, గుండాల : గుండాల మండల కేంద్రంలోని పిఎసిఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రంలో తూకం అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ రైతులు శుక్రవారం తీవ్ర ఆందోళనకు దిగారు. రోడ్డుపై దాన్యం బస్తాలకు నిప్పుపెట్టి నిరసన వ్యక్తం చేశారు. రైతులు తెలిపిన వివరాల ప్రకారం, మేకల చందు, మేకల సోమయ్య, శ్రీరాములు, ఉప్పలయ్య తదితర రైతులు విక్రయించిన వరి ధాన్యంలో 41 కిలోల జోకాలని ఉన్నప్పటికీ 42 కిలోలుగా  తూకం వేసుకుంటున్నారని ఆరోపించారు. ఈ విషయంపై కొనుగోలు కేంద్ర నిర్వాహకులను ప్రశ్నించగా, “మిల్లర్లు చెప్పినట్లుగానే చేస్తున్నాం” అని సమాధానం ఇచ్చినట్లు రైతులు తెలిపారు. దీంతో ఆగ్రహించిన రైతులు కేంద్రం ఎదుట ధర్నాకు దిగుతూ, జిల్లా కలెక్టర్ సంఘటన స్థలానికి రావాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పిఎసిఎస్ చైర్మన్ లింగాల భిక్షం సంఘటన స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని, బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకుడు మందడి రామకృష్ణారెడ్డి మిల్లర్లను తీవ్రంగా ప్రశ్నిస్తూ, 42 కిలోల జోకాలని కలెక్టర్ ఎలాంటి ఆదేశాలు ఇచ్చారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఆలస్యమవుతోందని రైతులు వాపోయారు. గన్నీ బస్తాల సరఫరాలో జాప్యం, కాంటాలు నిర్వహించిన తర్వాత లారీల కోసం గంటల తరబడి ఎదురుచూడాల్సి రావడం, మిల్లులకు ధాన్యం చేరిన తర్వాత మరో కిలో తక్కువ తూకం చూపించి కోత విధించడం వంటి సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు తెలిపారు. లోడ్ దిగించకుండా లారీలను నిలిపివేయడం వల్ల మరింత నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా స్థాయి అధికారులు పలుమార్లు పర్యవేక్షించినప్పటికీ పరిస్థితిలో మార్పు రాలేదని రైతులు విమర్శించారు. మిల్లర్ల నిర్లక్ష్య ధోరణిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో పాచిల్ల సర్పంచ్ అల్లం చెట్టి మహేష్, కొడపర్తి లక్ష్మయ్య, మాదరబోయిన యాదయ్య, గిరి, కత్తుల శ్రీనివాస్, మాదరబోయిన రాములు, అన్యపర్తి భిక్షం తదితరులతో పాటు సుమారు 50 మంది రైతులు పాల్గొన్నారు.

🕒 30 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/farmers-concern-over-irregularities-in-grain-weighing-in-gundals/article-16102

Tags: