సుల్తాన్ పూర్‌లో ఘనంగా చత్రపతి శివాజీ విగ్రహావిష్కరణ
- ముఖ్యఅతిథిగా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
విశ్వంభర, సంగారెడ్డి: అమీన్పూర్ జిహెచ్ఎంసి పరిధి సుల్తాన్పూర్ గ్రామంలో హిందూ సామ్రాజ్య స్థాపకుడుచత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహావిష్కరణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పటాన్చెరు స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి హాజరై శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా శివాజీ మహారాజ్ యూత్ అసోసియేషన్ సుల్తాన్పూర్ అధ్యక్షులు మన్నే గణేష్ ఆధ్వర్యంలో, సుల్తాన్పూర్ మాజీ ఎంపిటిసి పట్నం రాజు నేతృత్వంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి పూలమాల వేసి శాలువాతో ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, “శ్రీ చత్రపతి శివాజీ మహారాజ్ దేశభక్తి, ధైర్యసాహసాలకు ప్రతీక. యువత శివాజీ మహారాజ్ ఆశయాలను ఆదర్శంగా తీసుకొని సమాజ సేవలో ముందుండాలి” అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పటాన్చెరు మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు బాయికాడి విజయకుమార్, ఐలాపూర్ బి ఆర్ ఎస్ నాయకులు మాణిక్ యాదవ్, శివాజీ మహారాజ్ యూత్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు నర్సింగరావు,సంయుక్త కార్యదర్శి సభ్యులు మన్నే శివప్రసాద్, కుమ్మరి మహేష్, ప్రధాన కార్యదర్శి నాయకోటి శివశంకర్, కోశాధికారి శివకుమార్, పరిగి నరేందర్, రూఖేష్, కిరణ్, శ్రీకాంత్, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, ప్రజాప్రతినిధులు, శివాజీ మహారాజ్ అభిమానులు పాల్గొన్నారు.