కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఉన్న కార్యకర్తలకు న్యాయం చేస్తాం
విశ్వంభర, బషీర్ బాగ్: కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఉన్న కార్యకర్తలకు న్యాయం జరిగేలా చూడటమే తమ ఉద్దేశమని ఆల్ ఇండియా ప్రియాంక గాంధీ సంఘటన్ (పీజీఎస్ఏఐ) తెలిపింది. శనివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంఘటన్ రాష్ట్ర అధ్యక్షురాలు ఆర్. యమునారెడ్డి, ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ మాట్లాడుతూ ప్రతి సమస్యను కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గానికి తెలియజేయడం, సక్రమంగా పరిపాలనను అందించడం కోసమే బాధ్యతగా వ్యవహరిస్తామని, అలాగే పార్టీని బలోపేతం చేయడం ఎలాంటి రిమార్కు లేకుండా చూస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే ఒక క్రిస్టియన్, ముస్లిం అనే ముద్రలో ప్రతిపక్షాలు ఎత్తి చూపుతున్న తరుణంలో హిందూ ఓటు బ్యాంక్ ను కాపాడుకోవడం కోసం కృషి చేస్తామన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేసిందని, ఈ ఉద్యమంలో హిందువులు, ముస్లింలు కూడా పాల్గొన్నారని, బీజేపీ ఒక్క హిందువులను మాత్రమే చూస్తుందని, కాంగ్రెస్ పార్టీ అలా కాదని, అన్ని కులాలు, మతాలను ఒక్కటిగానే చూస్తుందన్నారు. సామాన్య ప్రజల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వలస వచ్చిన కార్యకర్తల నుంచి పార్టీని కాపాడుకుంటామని, సామాన్యుడి కోసం ఏర్పాటు చేసిన అదృష్ట ఫలాలను దళారుల చేతుల్లోకి వెళ్ళకుండా చేయడం, ఎవరికి చెందవలసిన అదృష్ట ఫలాలు వారికి అందేలా చూడటమే తమ ప్రధాన లక్ష్యమని సంఘటన్ వారు తెలిపారు. ఈ సమావేశంలో సంఘటన్ ప్రతినిధులు జి. రామారావు, కవితా హీరా నందాని, సర్దార్ రవీందర్సింగ్ తదితరులు పాల్గొన్నారు.