భద్రాచలంలో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ, చికిత్సా శిబిరాలు — ప్రజలు సద్వినియోగించుకోగలరు

భద్రాచలంలో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ, చికిత్సా శిబిరాలు — ప్రజలు సద్వినియోగించుకోగలరు

విశ్వంభర, భద్రాచలం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పేద ప్రజలు, గిరిజనులు, మహిళలు క్యాన్సర్ వ్యాధి నుంచి అప్రమత్తంగా ఉండేందుకు ఉచిత క్యాన్సర్ నిర్ధారణ, చికిత్సా శిబిరాలు నిర్వహించబడుతున్నాయి. ఈ శిబిరాలు జిల్లా కలెక్టర్  జితేష్ వి. పాటిల్ మార్గదర్శకత్వంలో, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, మారుతి నర్సింగ్ కాలేజ్, లయన్స్ క్లబ్, వికాస తరంగిణి భద్రాచలం సంయుక్త ఆధ్వర్యంలో జరుగనున్నాయి. ఎస్ఆర్ఎఐ వాసవి అసోసియేషన్, USA వారి సహకారం ఈ శిబిరాలకు మరింత బలాన్నిచ్చింది.ఈ శిబిరాలు ,జూన్ 29, 2025 (ఆదివారం): మారుతి నర్సింగ్ కాలేజ్, భద్రాచలం జూన్ 30, 2025 (సోమవారం): ప్రభుత్వ ఆసుపత్రి, దుమ్ముగూడెం ఈ ఆరోగ్య శిబిరాల్లో ప్రఖ్యాత క్యాన్సర్ హాస్పిటల్ అయిన ఎమ్.ఎన్.జె క్యాన్సర్ ఆసుపత్రి, హైదరాబాద్ నిపుణుల బృందం పాల్గొంటోంది. 1000 పడకల ఈ హాస్పిటల్ నుంచి రానున్న నిపుణులతో పాటు, భద్రాచలం ప్రాంతానికి చెందిన ప్రముఖ వైద్యులు డా. వి. జయభారతి (స్త్రీల వైద్య నిపుణురాలు) మరియు డా.యం. మధుమోహన్ రెడ్డి(సర్జికల్ అంకాలజిస్టు) లు సేవలందించనున్నారు. శిబిరంలో వచ్చే రోగులకు ఉచితంగా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తారు. అవసరమైతే ఆరోగ్యశ్రీ ద్వారా పూర్తి చికిత్స కూడా ఉచితంగా అందించబడుతుంది. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు పూర్తిగా వినియోగించుకోవాలని నిర్వాహకులు కోరారు.జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి. పాటిల్ కి ఈ కార్యక్రమం నిర్వహణకు సహకారం అందించినందుకు రెడ్ క్రాస్ జిల్లా కో-ఆర్డినేటర్ డా.ఎస్.ఎల్. కాంతారావు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డా.ఎస్.ఎల్. కాంతారావు, వై. సూర్యనారాయణ, ఎ. జగదీష్, బి. రాజారెడ్డి, డా.బి. సుబ్బరాజు, డా.యం.మోహన్రావు,  వి.కామేశ్వరరావు, డా.జీవివి సుదర్శన్ రావు, గట్టువెంకటాచారి, డా. పి. రాజశేఖర్, పాకాల దుర్గా ప్రసాద్, లయన్ కమలా రాజశేఖర్, డా. భాను ప్రసాద్, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.
 
 

Tags: