దోతిగూడెం బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం

విశ్వంభర:-యాదాద్రి భువనగిరి-భూదాన్ పోచంపల్లి:- సబ్బండ వర్ణాల పోరాటం, ఎంతో మంది అమరవీరుల ప్రాణాలలతో తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన రోజు జూన్ 2. తెలంగాణ చరిత్రలో ఇదొక గొప్ప పర్వదినం. ఈ సందర్బంగా భారతీయ జనతా పార్టీ, పోచంపల్లి తరఫున రాష్ట్ర ప్రజలందరికి హృదయపూర్వక శుభాకాంక్షలు. తెలంగాణ స్వరాష్ట్రం సిద్ధించి పుష్కర కాలం పూర్తయిన సందర్భంగా మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ పోచంపల్లి అధ్యక్షుడు మేకల రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని దోతిగూడెం గ్రామంలో రాష్ట్ర అవతరణ వేడుకలు నిర్వహించడం జరిగింది. జాతీయ జెండా ఆవిష్కరించి, తెలంగాణ అమరుల త్యాగాలను స్మరించుకున్నాం. తెలంగాణ స్వరాష్ట్ర సాధనలో సబ్బండ వర్ణాల పోరాటలతోపాటు భారతీయ జనతా పార్టీ సహకారం మరిచిపోలేనిది. ఈ పుష్కర కాలంలో తెలంగాణ అభివృద్ధికి తోడ్పాటు అందించిన కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మున్ముందు రాష్ట్రం మరింత అభివృద్ధి సాధించి దేశానికి తలమానికం కావాలని సదా ఆకాంక్షిస్తున్నాం. ఈ కార్యక్రమంలో బీజేపీ పోచంపల్లి మండల జనరల్ సెక్రెటరీ ముద్దం హరీష్, బీజేపీ సీనియర్ నాయకులు, దోతిగూడెం గ్రామ ఉపసర్పంచ్ బద్దం వెంకటరెడ్డి, బూత్ అధ్యక్షులు యాట శ్రీనాథ్, సీనియర్ నాయకులు గుమ్మి దామోదర్ రెడ్డి, జంగయ్య, వస్పరి రాకేష్, పి వెంకటేష్, బి కిరణ్, కె మణికంఠ, వై విజయ్ తదితర నాయకులు పాల్గొన్నారు.

Read More కళ్ళకు గంతలు కట్టుకొని విఓఏల వినూత్న నిరసన    

🕒 02 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/dothigudem-telangana-independence-day-under-the-leadership-of-bjp/article-16134

Tags: