కేశంపేట ఆసుపత్రిలో మెగా హెల్త్ క్యాంపు
విశ్వంభర, షాద్ నగర్ : తెలంగాణ ప్రభుత్వము 99 రోజుల ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక ప్రోగ్రాంలో భాగంగా సోమవారం షాద్ నగర్ డివిజన్ కేశంపేట మండల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెగా స్పెషలిస్ట్ వైద్య ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేసింది. మెగా వైద్య ఆరోగ్య శిబిరంను షాద్ నగర్ శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్, గ్రామ సర్పంచ్ శాంత చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో షాద్ నగర్ శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ, మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెషలిస్ట్ మెగా వైద్య శిబిరంలో 6 మంది, డాక్టర్ అమృత మహిళలకు సంబంధించిన స్పెషలిస్ట్, డాక్టర్ ఆఫ్ రింగ్ కాన్ చిన్నపిల్లల స్పెషలిస్ట్, డాక్టర్ ఉమామహేశ్వరి కంటి వైద్య నిపుణులు, డాక్టర్ సుష్మ శ్రీ ఎముకల సంబంధించిన ప్రత్యేక వైద్య నిపుణులు, డాక్టర్ ప్రతిభా దంత వైద్య నిపుణులు, డాక్టర్ వీరప్రసాద్ జనరల్ మెడిసిన్ వైద్య నిపుణులు వీరందరూ హైదరాబాద్ నుంచి వచ్చిన స్పెషలిస్టులు మన గ్రామంలో ఉన్న అందరికీ 60 రకాల పరీక్షలు నిర్వహిస్తారని తెలియజేశారు. గర్భవతులకు, చిన్నపిల్లలకు, దంత సమస్యలకు, కంటి చూపుకు, జనరల్ గా సంబంధించిన వ్యాధులకు, మరియు మోకాళ్ల నొప్పులు కీళ్ల నొప్పులకు సంబంధించిన బీపీ షుగర్లకు సంబంధించిన వ్యాధుల గురించి ఇక్కడ ప్రత్యేకంగా చికిత్స చేసి ఫ్రీగా మందులు అందజేస్తారని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ మెగా స్పెషలిస్ట్ వైద్యుల క్యాంపును కేశంపేట మండలంలోని ప్రజలందరు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే తెలియచేశారు.ఇవే పరీక్షలు ప్రైవేటు ఆసుపత్రుల్లో చేయిస్తే ఒక్కొక్కరికి 4,000 నుండి 5000 రూపాయలు ఖర్చు అవుతుందని, అలాంటిది మన పేదల ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడి ప్రజలకు ఉచితంగా,క్యాంప్ పెట్టి అన్ని ఫ్రీగా చేయిస్తుందని ప్రజలకు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో అందరు సర్పంచులు,మాజీ జెడ్పిటిసి తాండ్ర విశాల రెడ్డి, ప్రజా నాయకులు, షాద్ నగర్ డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి, కేశంపేట వైద్యాధికారి డాక్టర్ నికిత, హెల్త్ ఎడ్యుకేటర్ జే. శ్రీనివాసులు, ఎం ఎల్ హెచ్ పి వైద్యాధికారులు, ఎం పి హెచ్ ఈ ఓ లు శ్రీనివాస్, శివానంద్, హెల్త్ సూపర్వైజర్లు, స్టాఫ్ నర్సులు, మహిళ ఆరోగ్య కార్యకర్తలు , రవికుమార్, సీనియర్ అసిస్టెంట్, ఎల్ డి కంప్యూటర్ మరియు ఆశాలు మొదలుకు వారు పాల్గొన్నారు.



