ఇందిరమ్మ క్యాంటీన్ పనులు ప్రారంభించిన చార్మినార్ డిసి
On
విశ్వంభర, చార్మినార్: చార్మినార్ నియోజకవర్గం లోని లాల్ దర్వాజా మోడ్ సుధా సినీప్లెక్స్ దగ్గర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ క్యాంటీన్ పనులు జిహెచ్ఎంసి చార్మినార్ జోన్ డిప్యూటీ కమిషనర్ సరిత పనులు ప్రారంభించారు. ప్రజలకు అందుబాటు ధరలు ఐదు రూపాయలకే టిఫిన్, అయిదు రూపాయలకు భోజనం ప్రభుత్వం అందిస్తుందని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఆమె తెలిపారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరి బాధ్యత "పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుందాం, ఇంట్లో ఉన్న చెత్తను చెత్త బండ్లోనే వేద్దాం " ప్రగతిలో ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు, అభివృద్ధి పలాలు కూడా అందుకుందామని ఆమె వివరించారు



