మనిషి గౌరవాన్ని నిలబెట్టేది విద్య ఒక్కటే- రాధాకృష్ణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ జర్పుల దశరథ్ నాయక్

WhatsApp Image 2024-07-23 at 13.47.48_f4bd6ead

విశ్వంభర' కడ్తాల్' జూలై 23 : - కడ్తాల్ మండలం వెలుగు రాళ్ల తండా కు చెందిన ఇస్లావత్ మారుతి కుమార్ జేఈఈ ప్రవేశ పరీక్షలో లో ఆల్ ఇండియా ఎస్టీ కేటగిరిలో 391వ ర్యాంకు సాధించడం జరిగింది. ఈ సందర్భంగా మండల మాజీ జెడ్పిటిసి జర్పుల దశరథ్ నాయక్ విద్యార్థిని సత్కరించి రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ నుండి 5000 రూపాయలు నగదు అందించారు ఎస్టి కేటగిరిలో ఆల్ ఇండియా ర్యాంకు సాధించడం గిరిజన జాతికి గర్వకారణం అని మెచ్చుకున్నారు. అదేవిధంగా ఇంకా ఉన్నత చదువు అభ్యసించడానికి మా ట్రస్టు ద్వారా సహాయం అందజేస్తామని తెలిపారు. భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు ఎదిగి దేశానికి గ్రామానికి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు పాండు, శ్రీను, కృష్ణ,  శ్రీను చందర్, వెంకటేష్, రతన్, గణేష్ రవి నాయకులు తదితరులు పాల్గొన్నారు

Read More అమీర్అలీఖాన్ ను సత్కరించిన మీర్జా అహ్మద్ బేగ్