ఓటర్ల సందేహాల నివృత్తికి కలెక్టరేట్‌లో హెల్ప్‌డెస్క్ ఏర్పాటు

విశ్వంభర, సూర్యాపేట: జిల్లాలో ఎస్‌ఐఆర్–2026 ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు సూర్యాపేట జిల్లా కలెక్టరేట్‌లో ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. ఈ హెల్ప్‌డెస్క్ ద్వారా 2002 ఓటరు జాబితాలోని వివరాల పరిశీలన, ఎన్యుమరేషన్ ఫారమ్‌ల భర్తీపై అవగాహన, ఓటరు నమోదు, మార్పులు, చేర్పులు, సాంకేతిక సమస్యల పరిష్కారానికి సహాయం అందిస్తామని పేర్కొన్నారు. జిల్లాలోని ఓటర్లందరూ ఈ సేవలను వినియోగించుకొని తమ వివరాలను ధృవీకరించుకోవాలని సూచించారు. ఎస్‌ఐఆర్–2026 ప్రక్రియకు సంబంధించిన సందేహాల నివృత్తి కోసం కలెక్టరేట్ హెల్ప్‌డెస్క్ (6281492368), డీటీ ఎలక్షన్ భరత్ (9573085943), ఐటీ సపోర్ట్ రణదీప్ (9059170790)ను సంప్రదించాలని జిల్లా ఎన్నికల యంత్రాంగం తెలిపింది. పారదర్శకమైన, తప్పుల్లేని ఓటరు జాబితా రూపొందించడంలో ప్రతి ఓటరు భాగస్వామి కావాలని, ఎన్యుమరేషన్ ఫారమ్‌లను సక్రమంగా నింపేందుకు హెల్ప్‌డెస్క్ సిబ్బంది సహకారం తీసుకోవాలని కలెక్టర్ కోరారు

🕒 08 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/helpdesk-set-up-in-the-collectorate-to-resolve-voter-queries/article-18174

Tags: