నీట్ ఫలితాల్లో మరోసారి అగ్రగామిగా నిలిచిన రేసోమెడికాన్

ఎన్‌టీఏ తాజాగా విడుదల చేసిన నీట్ -2026 ఫలితాల్లో హనుమకొండలోని రేసో మెడికాన్ జూనియర్ కళాశాల విద్యార్థులు మరోసారి అద్భుతమైన ప్రతిభను కనబరిచారని కళాశాల రేజోనన్స్ సంస్థ చైర్మన్ లెక్కల రాజిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు.ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా నీట్-2026 పరీక్షకు హాజరైన రేసో మెడికాన్ విద్యార్థుల్లో అత్యధిక శాతం మంది ఫ్రీ మెడికల్ సీట్లు సాధించే స్థాయిలో ఉత్తమ మార్కులు సాధించారని, పలువురు విద్యార్థులు ప్రతిష్టాత్మక ప్రభుత్వ, ప్రముఖ మెడికల్ కళాశాలల్లో ప్రవేశాలు పొందనున్నారని లెక్కల రాజిరెడ్డి తెలిపారు.

అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులలో 
శ్యాం కరన్ 655 మార్కులు,గురురాజ్ రెడ్డి 630 మార్కులు
కోమల్ 591 మార్కులు
అభిషేక్ 580 మార్కులు
సాక్షి 546 మార్కులు
మహమ్మద్ అద్నాన్ 528 మార్కులు,మణిదీప్ 528 మార్కులు,వేముల జస్విన్ ప్రీత్ 500 మార్కులు సాధించారు.ఈ సందర్భంగా చైర్మన్ లెక్కల రాజిరెడ్డి గారు మాట్లాడుతూ వరంగల్, హనుమకొండ జిల్లాల్లో ఎక్కడా లేని విధంగా అత్యుత్తమ వసతులతో ప్రత్యేకంగా బిపిసి విద్యార్థుల కొరకు మొట్టమొదటి సారిగా బిపిసి ప్రత్యేక నీట్ కోచింగ్ క్యాంపస్ స్థాపించి నీట్ శిక్షణను నిర్వహిస్తున్నామని, జాతీయ స్థాయి అనుభవం కలిగిన ఉపాధ్యాయులను నియమించి నిరంతరము మేనేజ్‌మెంట్ పర్యవేక్షణలో ప్రతి విద్యార్థికి వ్యక్తిగత శ్రద్ధతో బోధించడం వలన ప్రతి సంవత్సరం అద్భుతమైన విజయాలను సాధించడము 
సాధ్యమైతుందని తెలుపుతూ ఈ అవకాశాన్ని మన జిల్లాల తల్లితండ్రులు విద్యార్థులు వినియోగించుకోవాలని కోరారు.ఈ సందర్భంగా రేసోమెడికాన్ మేనేజింగ్ డైరెక్టర్ దీప్తిరావు  మాట్లాడుతూ ఇంకా 56 మంది విద్యార్థులు 400కు పైగా మార్కులు సాధించి, ఫ్రీ మెడికల్ సీట్లు పొందే అవకాశాలను మెరుగుపరుచుకున్నారని తెలిపారు. ఈ ఘన విజయానికి కృషి చేసిన విద్యార్థులు, అధ్యాపక బృందం మరియు తల్లిదండ్రులకు సంస్థ యాజమాన్యం హృదయపూర్వక అభినందనలు తెలియజేసింది.ఈ విజయాన్ని పురస్కరించుకుని రేసోమెడికాన్‌లో నీట్-2026 విద్యార్థుల అభినందన సభలో రేసోనెన్స్ మేనేజింగ్ డైరెక్టర్  దీప్తిరావు, ఇతర డైరెక్టర్లు లెక్కల మహేందర్ రెడ్డి,మాదిరెడ్డి దేవేందర్ రెడ్డి, సి.ఈ.ఓ. లెక్కల రమ్యారాజిరెడ్డి, ప్రిన్సిపాల్, ఫ్యాకల్టీ, ర్యాంకులు సాధించిన విద్యార్థినీ విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Read More బిఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాలు

🕒 18 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/racemedicon-has-once-again-topped-the-neet-results/article-18829

Tags: