ఆల్ఫోర్స్ జూనియర్ కాలేజీలో ఘనంగా ఫ్రెషర్స్ పార్టీ

విశ్వంభర, హనుమకొండ:ఆల్ఫోర్స్ జూనియర్ కాలేజీలో నూతన విద్యార్థులకు స్వాగతం పలుకుతూ ఫ్రెషర్స్ పార్టీని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆల్ఫోర్స్ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ వ్యవస్థాపకులు, చైర్మన్ డా. వి. నరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా చైర్మన్ నరేందర్ రెడ్డి నూతన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, విద్యార్థులు స్పష్టమైన లక్ష్యంతో క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర శ్రమతో చదివితే జీవితంలో అత్యున్నత విజయాలను సాధించగలరని తెలిపారు. సమయపాలన, విలువలతో కూడిన విద్య, ఆత్మవిశ్వాసం మరియు సానుకూల దృక్పథమే విజయానికి మూలమని విద్యార్థులకు మార్గదర్శనం చేశారు.విద్యార్థులు చదువుతో పాటు వ్యక్తిత్వ వికాసం, నైతిక విలువలు, సామాజిక బాధ్యతలను కూడా అలవర్చుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించగా, కళాశాల చైర్మన్ డా.వి.నరేందర్ రెడ్డి  వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్స్,అధ్యాపకులు, సిబ్బంది మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

🕒 19 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/a-grand-freshers-party-at-alforce-junior-college/article-18861

Tags: