శ్రీ కనకదుర్గ దేవి ఆలయ ధర్మకర్త గా ధూళిపాళ వెంకట సాయి సుబ్రహ్మణ్యం ప్రమాణ స్వీకారం
On
విశ్వంభర, హైద్రాబాద్ :- తెలంగాణ ప్రభుత్వం, దేవాదాయ శాఖ అమీర్ పేట్ లోని శ్రీ కనకదుర్గ దేవి ఆలయంలో నూతన ధర్మకర్తల ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహించారు. ధూళిపాళ వెంకట సాయి సుబ్రహ్మణ్యం దేవాలయ ధర్మకర్తగా ప్రమాణ స్వీకారం చేశారు. నూతన ధర్మకర్తల ప్రమాణ స్వీకారం కనకదుర్గ దేవి ఫౌండర్ ట్రస్ట్ సభ్యులు అలాగే దేవాదాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్బంగా ధర్మకర్త గా ప్రమాణ స్వీకారం చేసిన ధూళిపాళ వెంకట సాయి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి ధర్మకర్త గా భాద్యతలు కల్పించినందుకు కమిటీకి , సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే అమ్మవారికి సేవ చేసే భాగ్యం కలిగినందుకు సంతోషంగా ఉందని అన్నారు, ఆలయ అభివృద్ధిలో తనవంతు భాద్యతను నిర్వర్తిస్తానని అన్నారు. సహకరించిన ప్రతిఒక్కరికి ధన్యావాదాలు తెలిపారు, 




