భారత్ ముక్తి మోర్చా ఆధ్వర్యంలో ధర్నా 

భారత్ ముక్తి మోర్చా ఆధ్వర్యంలో ధర్నా 

విశ్వంభర, పరిగి: కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కుల గణన లో ఓబీసీ కులాలను పొందపార్చాలనీ పరిగి పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద  నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారత్ ముక్తి మోర్చా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోవింద్ నాయక్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం జరపనున్న జనగణన లో ఓబీసీ కులాల వారి జనగణన చేపట్టాలని, ఓబీసీ పట్టికను పొందపార్చాలని అన్నారు. 1931 లో బ్రిటిష్ ప్రభుత్వంలో  జరిగిన కుల గణన లో ఓబీసీ లను లెక్కించారు. ఓబీసీ లను కుల గణన చేస్తాము అని పార్లమెంట్ లో తీర్మానం చేసి లెక్క చేయకపోవడం బీసీ లను మరో సారి మోసం చేస్తున్నది బీజేపీ నరేంద్రమోడీ ప్రభుత్వం అని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థుల రక్షణ కొరకకు తెచ్చిన యుజిసి చట్టం- 2026ను  అమలు చేయాలని కోరారు. ప్రజాస్వామ్య విరుద్ధమైన ఈవిఎంల ద్వారా ఎన్నికలు నిర్వహిస్తూ దేశ మూలనివాసి బహుజనులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో జిల్లా  జేఏసీ అధ్యక్షుడు నాగేశ్వర్,  సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు వెంకటయ్య, ఎండి హబీబ్, సత్తయ్య, పీర్ మమ్మద్, భారత్ ముఖి మోర్చా జిల్లా నాయకులు శంకర్, వీరేందర్ నాయక్, ఓబీసీ మోర్చా జిల్లా నాయకులు కృష్ణ, ఆర్టీసీ యూనియన్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Tags: