పేరెంట్స్ మీటింగ్ లో పాల్గొన్న ఎంపీడీవో
On
విశ్వంభర, మర్పల్లి: తెలంగాణ ప్రభుత్వం 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా గురువారం ఎస్సీ బాలికల బాలుర వసంతి గృహం సిరిపురంలో విద్యార్థుల తల్లిదండ్రులు,టీచర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎంపీడీవో శ్రీనివాస్, హాస్టల్ వార్డెన్ జి తుల్జారామ్ గౌడ్ ,స్పెషల్ ఆఫీసర్ సిరిపురం పశు వైద్యశాల డాక్టర్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులకు అన్ని సౌకర్యాలు ప్రభుత్వము కల్పిస్తుందని వచ్చే విద్యా సంవత్సరం వసతి గృహంలో ఎక్కువమంది విద్యార్థులను చేర్పించాలని వారు విద్యార్థుల తల్లిదండ్రులను తల్లిదండ్రులను కోరారు. ఈ సమావేశంలో సిరిపురం జిల్లా పరిషత్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు మల్లికార్జున్ , సెక్రటరీ లక్ష్మీకాంత్, టీచర్లు, హాస్టల్ సిబ్బంది పాల్గొన్నారు



