ఘనంగా దేవి మండప పూజ కార్యక్రమం. 

నెం 1 దుర్గామాత చండూర్  MYC యూత్ ఉత్సవాల ఏర్పాట్లు ప్రారంభం 

ఘనంగా దేవి మండప పూజ కార్యక్రమం. 

విశ్వంభర, చండూర్ : - నెంబర్ దుర్గామాత చండూర్  MYC యూత్ నిర్వహిస్తున్న ప్రధమ వార్షికోత్సవ శ్రీ దేవి శరన్నవరాత్రులను పురస్కరించుకొని నేడు బుధవారం స్థానిక సీత రామ చంద్ర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో మండప పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పురోహితులు  చిరువెళ్లి అజయ్ శర్మ ఆధ్వర్యంలో  కాలనీ వాసుల సమక్షంలో ప్రతిఒక్కరి చేత కొబ్బరికాయలు కొట్టించి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్విరామంగా అమ్మవారి పూజ కార్యక్రమాలు కొనసాగాలని కోరుకోవడం జరిగింది. దేవి ఉత్సవాల సందర్బంగా ఈ 12 రోజులు భక్తిశ్రద్దలతో అమ్మవారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు , భజన కార్యక్రమాలు , కుంకుమార్చన , దేవి స్తోత్రం , చిన్నారులకు సాంస్కృతిక కార్యక్రమాలు , అన్నదానం వంటి కార్యక్రమాలు చేపడుతామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ పెద్దలు రుద్ర శేఖర్ , చెరుపల్లి భిక్షమయ్య , గంజి భావనారుషి , చెరుపల్లి రాము , చెరుపల్లి శ్రీను , పలువురు మహిళలు అలాగే శ్రీమాన్ ,   ఏలే చంద్రశేఖర్ , రాపోలు శ్రీను,  జూలూరి మల్లేష్ , గుర్రం శేఖర్ , గుర్రం రాము , చెరుపల్లి శివ , సంగిశెట్టి సాయి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొదటిసారి వైభవోపేతంగా చేపడుతున్న ఉత్సవాలకు దాతలు సహకరించగలరు. 

Tags: