ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి 

: జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్

విశ్వంభర, మహబూబాబాద్: ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ లోని ప్రధాన సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి లో జిల్లా కలెక్టర్ అదనపు కలెక్టర్ కె.అనిల్ కుమార్ తొ కలిసి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా గూడూరు మండలం వెంగంపేట గ్రామానికి చెందిన కట్ల పార్వతి తాను ఉన్న ఇల్లు శిథిలావస్థకు చేరడంతో దానిని కూల్చివేసి పక్కన ఉన్న ఖాళీ స్థలంలో రేకుల షెడ్ లో కిరాయికి ఉంటున్నామని అది ఈ మద్య కురిసే వర్షాలకు శిథిలావస్థకు చేరుకోవడం జరిగిందని దయచేసి తమ కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయగలరని కోరారు. మరిపెడ మండలం వీరారం తండ కు చెందిన డి.రమేష తనకున్న పట్టా భూమిలోని కొంత భూమి గుర్తు తెలియని వ్యక్తీ అక్రమంగా పట్టా చేయించుకున్నారని అట్టి పట్టాను రద్దు చేసి తనకు న్యాయం చేయాలని కోరారు. పెద్దవంగర మండలం పోచంపల్లి గ్రామానికి చెందిన సుధగాని యాధలక్ష్మి 2023-24 సం.లో గ్రామాభివృద్ది కోసం ఖర్చు చేసి యం.బి రికార్డు అయిన బిల్లులను ఇప్పించగలరని కోరారు. ఈ రోజు నిర్వహించిన ప్రజావాణి లో వివిధ శాఖలకు సంబంధించి (205) దరఖాస్తులను సంబందిత శాఖల అధికారులకు సత్వర పరిష్కారానికి పరిశీలించారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో డి.ఆర్.ఓ నాగలక్ష్మి, డిప్యుటీ కలెక్టర్,   జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

🕒 30 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/actions-should-be-taken-to-resolve-the-prabhavani-applications/article-17453

Tags: