రైతు అమ్మింది 953 ధాన్యం బస్తాలు
- గమ్యస్థానానికి చేరింది 905 బస్తాలే, మిగతావి ఎక్కడ?...
విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, ఎన్నారం గ్రామానికి చెందిన ఏనుగు దామోదర్ రెడ్డి, మరి కొందరు రైతులు తాము సాగు చేసిన రబీ వరి ధాన్యాన్ని తమ గ్రామం ఎన్నారంలోని పిఏసిఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రంలో పోసి, తమ వంతు వచ్చాక ధాన్యం కాంటా వేయిస్తే 953 బస్తాలు (ఒక్కోటి 42 కేజీలవి) గా ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వాహకులు లెక్కించి లారీ లోడు చేయించారు. లారీ హనుమకొండ జిల్లాలోని ఒక మిల్లుకు పంపగా, అక్కడి మిల్లు యజమాని రైతు ఈ రైతులకు సంబందించి కేవలం 905 ధాన్యం బస్తాలు మాత్రమే ముట్టినట్టుగా ట్రక్ షీట్ లో లెక్క చూపారు. తూకం 37870 కేజీలుగా మిల్లు యజమాని చూపించినాడు. దీంతో మిగిలిన 48 బస్తాల ఆచూకీ తెలియక పోవడం ఆందోళనకు గురిచేసింది. మిల్లు యజమాని చెప్పిన తూకం లెక్క ప్రకారం ధాన్యం బస్తాల లెక్క సరిపోలడం లేదు. రవాణా సమయంలో బస్తాలు ఎక్కడ మాయమయ్యాయనే విషయంపై స్పష్టత లేకపోవడంతో సంబంధిత రికార్డులు, రవాణా వివరాలను పరిశీలించాలని బాధిత రైతులు కోరుతున్నారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులు దర్యాప్తు చేపట్టి, మాయమైన బస్తాల ఆచూకీ గుర్తించి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని గ్రామంలోని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. మరి ఈ కొనుగోళ్ళ గోల్ మాల్ మాయాజాలంలొ తప్పు ఎవరిది? ఎవరి వాటా ఎంత? 953 బస్తాలుగా ఆ రైతులకు లెక్క చూపించిన ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వాహకులదా? లారీ డ్రైవరుదా? ధాన్యం అన్లోడ్ చేయించుకున్న మిల్లు యజమానిదా? ఒకరిద్దరు రైతుల దగ్గరనే ఇన్ని బస్తాల లెక్క మాయం అయితే, ఇలా ఎందరు రైతుల నుండి ఎన్ని బస్తాలు లెక్క మాయం చేసి రైతులను దోచుకుంటున్నారో? ఇందులో ఎవరి పాపం ఎంతెంత ఉందో? లెక్క తేలాలని రైతులు కోరుతున్నారు. తాము ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని, తమ శ్రమను, తమ చెమట రక్తాన్ని ఇలా దోచుకోవడం ఎంతవరకు సబబు అని రైతులు వాపోతున్నారు. దీని గురించి సంబందిత ఏ అధికారిని అడిగినా సమాధానం శూన్యం. దీనిపై ఉన్నత స్థాయిలో సమగ్ర విచారణ చేపట్టి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇప్పించాలని, దీనికి కారకులపై తగు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.