అలీ అబ్బాస్ పీర్ల మాన్యం భూములను కాపాడాలి

విశ్వంభర, మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ పట్టణంలోని అలీ అబ్బాస్ పీర్ల చావిడికి చెందిన సుమారు 6.30 ఎకరాల మాన్యం భూములను భూకబ్జాదారులు ఆక్రమించి ప్లాట్లుగా విక్రయిస్తున్నారని మొహరం (పీర్ల పండుగ) నిర్వహణ సంఘం కన్వీనర్ జి. గట్టన్న ఆరోపించారు. ఈ విషయమై సోమవారం ప్రజావాణిలో జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించినట్లు తెలిపారు. ఫైర్ స్టేషన్ సమీపంలోని సర్వే నంబర్లు 1023, 961లో ఉన్న ఈ భూములను పరిరక్షించి, ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ హామీ ఇచ్చినట్లు గట్టన్న తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎఫ్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.ఎం. ఖలీల్, మొహరం నిర్వహణ సంఘం నాయకులు నర్సింలు, చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.

🕒 30 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/respected-lands-of-ali-abbas-peers-should-be-protected/article-17451

Tags: