ఎంసీఈఎంఈలో ఘనంగా 109వ స్నాతకోత్సవం
విశ్వంభర, సికింద్రాబాద్: సికింద్రాబాద్‌లోని మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ లో 109వ స్నాతకోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 45 మంది సైనిక అధికారులకు బీటెక్ డిగ్రీలను ప్రదానం చేశారు. ఇందులో 32 మంది డిగ్రీ ఇంజనీరింగ్, 13 మంది టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ అధికారులు ఉండగా, నలుగురు విదేశీ సైనిక అధికారులు కూడా పట్టాలు అందుకున్నారు. ఎంసీఈఎంఈ కమాండెంట్ లెఫ్టినెంట్ జనరల్ నీరజ్ వర్ష్ణే ముఖ్య అతిథిగా హాజరై ప్రతిభ కనబరిచిన అధికారులకు బంగారు, వెండి పతకాలు అందజేశారు. డిగ్రీ కోర్సులో మేజర్ భరతేందు నేగి, కోర్సులో లెఫ్టినెంట్ సాహిబ్ సింగ్ ఓవరాల్ బెస్ట్ స్టూడెంట్లుగా నిలిచారు. ఈ సందర్భంగా యువ అధికారులు రూపొందించిన రక్షణ సాంకేతికతకు సంబంధించిన వినూత్న ప్రాజెక్టులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమంలో సైనిక ఉన్నతాధికారులు, పట్టభద్రుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.