పోలియో చుక్కలతో రోగనిరోధక శక్తి 

పోలియో చుక్కలతో రోగనిరోధక శక్తి 

విశ్వంభర, సిద్దిపేట: పోలియో చుక్కలతో చిన్నారులకు రోగ నిరోధకశక్తి పెరుగుతుందని రూరల్ మండల వైద్యాధికారి, పుల్లూరు పీహెచ్‌సీ డాక్టర్ రాజేందర్ చెప్పారు. పోలియో చుక్కలు వేయించడంలో తల్లిదండ్రులు నిర్లక్ష్యం వహించొద్దని సూచించారు. సోమవారం పుల్లూరు స్టేజీ దగ్గరనున్న సిమెంట్ పోల్స్ తయారీ కుటీర పరిశ్రమ, తదితర హైరిస్క్ ఏరియాల్లో సిబ్బందితో కలిసి సోమవారం పల్స్ పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజేందర్ మాట్లాడుతూ చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. మిగిలిన చిన్నారులకు మంగళవారం రోజు కూడా పోలియో చుక్కలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. పోలియో రహిత సమాజాన్ని నిర్మించడానికి ప్రతీ ఒక్కరు వైద్య సిబ్బందికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో సిబ్బంది కవిత, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

🕒 30 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/immunization-with-polio-drops/article-17443

Tags: