సైదాబాద్ లోని స్టీల్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి కి సంగం లక్ష్మీబాయి పేరు పెట్టాలి
విశ్వంభర, సంతోష్ నగర్:- ప్రముఖ స్వాతంత్ర సమరయోధురాలు, లోక్సభ సభ్యురాలు, సంఘ సేవకురాలైన దివంగత సంఘం లక్ష్మీబాయి పేరు సైదాబాద్ లోని స్టీల్ ఫ్లైఓవర్ బ్రిడ్జికి పెట్టాలని తెలంగాణ స్వాభిమాన్ పరిషత్ కన్వీనర్ కే వినయ్ కిషోర్ యాదవ్ అన్నారు. ఈరోజు చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ గారికి వినతి పత్రం అందజేశారు. హైదరాబాద్ జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్ వి కర్ణన్ గారికి కూడా వినతిపత్రం అందించామని, అలాగే జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి, అసదుద్దీన్ ఓవైసీ గారికి, తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి కూడా త్వరలో ఈ యొక్క వినతి పత్రం అందిస్తామని కే వినయ్ కుమార్ యాదవ్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేయడం శుభసూచకమని. అభివృద్ధిని, తీపి గుర్తులను ఎప్పుడూ నెమరు వేసుకోవాలని అలాగే సంగం లక్ష్మీబాయి పరిపాలన దక్షతను కూడా చూస్తూ ఆమె చేసిన, ఆమె చూపిన మార్గాలను మరువకూడదని అలాగే 1952లో శాసన సభ్యురాలుగా, 1954నుండి 1956వరకు రాష్ట్ర విద్యా శాఖ ఉప మంత్రిగా, 1957నుండి 1972 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోక్సభ సభ్యురాలుగా సేవలందించి, నిరుపేద బడుగు బలహీన వర్గాల పిల్లల కొరకు ఇంద్రసేవ సదన్ పేరున వసతి గృహం ఏర్పాటు చేయడమే కాకుండా ఎంహెచ్ గుప్తా (మా శెట్టి హనుమంత గుప్తా ), పాఠశాలను ఏర్పరిచి సైదాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో వేలాది మంది పిల్లలకు విద్యను అందించిన ఘనత సంఘం లక్ష్మీబాయి ది అన్నారు. నేడు ప్రాచుర్యంలో ఉన్న ఐఎస్ సదన్ ఇప్పటి భారత ప్రధాని అయిన స్వర్గీయ ఇందిరాగాంధీ పేరున ఏర్పరచి ఇంద్రసేవ సదన్ ప్రస్తుతం సంఘం విద్యార్థి ద్వారా విద్యను అందిస్తున్న మహిళా జూనియర్ కళాశాల మహిళా ఇంజనీరింగ్ కళాశాల కూడా సంఘసంస్కర్త అయిన సంఘం లక్ష్మీబాయి కన్నకలల లో భాగమే కావున ఇంతటి మహానుభావు రాలైన మన ప్రాంతంలో నివసించి పేద బడుగు బలహీన వర్గాల పిల్లల అభివృద్ధికి పాటుపడిన సంగం లక్ష్మీబాయి పేరును, మరియు కాంస్య విగ్రహాన్ని నెలకొల్పాలని పార్టీలకతీతంగా కోరారు. ఈ కార్యక్రమంలో రాజు యాదవ్, శ్రీకాంత్, సురేష్ యాదవ్ రాకేష్ సంతోష్,ఐ అనిల్, ప్రదీప్ ప్రభాకర్ సునీల్ తదితరులు పాల్గొన్నారు.