బీఎల్ఓ విధులతో అంగన్‌వాడీ వేళల్లో మార్పు

విశ్వంభర, హైదరాబాదు : బీఎల్ఓ విధులు నిర్వహిస్తున్న అంగన్‌వాడీ టీచర్లు ఉన్న కేంద్రాలు జూన్ 29 నుంచి జూలై 28 వరకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పనిచేస్తాయి అని మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ శృతి ఓజా తెలిపారు. ఎన్నికల కమిషన్ నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో అంగన్‌వాడీ టీచర్లు బూత్ లెవల్ ఆఫీసర్లుగా విధులు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ మేరకు మెమో జారీ చేశారు. బీఎల్ఓ విధుల్లో ఉన్న సిబ్బందికి ఇతర పనులు అప్పగించవద్దన్న రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ తాత్కాలిక మార్పు చేసినట్లు పేర్కొన్నారు. పోషకాహారం పంపిణీ, ప్రీ-స్కూల్ విద్య, గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందించే సేవలకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని, కేంద్రాల్లో పిల్లల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. ఈ ఆదేశాలను జిల్లాల్లో సమర్థంగా అమలు చేయాలని జిల్లా మహిళా, శిశు సంక్షేమ అధికారులను డైరెక్టర్ ఆదేశించారు.

🕒 30 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/change-in-anganwadi-timings-with-blo-duties/article-17371

Tags: