గుండాల చేనేత సహకార సంఘం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
- జూలై 10న రహస్య బ్యాలెట్‌తో ఎన్నికలు.. 9 మంది నిర్వహణ కమిటీ సభ్యుల ఎంపిక
విశ్వంభర, గుండాల:గుండాల హ్యాండ్లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ నిర్వహణ కమిటీ ఎన్నికల నోటిఫికేషన్ సోమవారం విడుదలైంది. తెలంగాణ రాష్ట్ర సహకార ఎన్నికల ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు జూలై 10న రహస్య బ్యాలెట్ విధానంలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల అధికారి పి. నాగేశ్వర్ రెడ్డి తెలిపారు. మొత్తం 9 మంది నిర్వహణ కమిటీ సభ్యులను ఎన్నుకోనుండగా, మహిళలకు 2, ఓపెన్ కేటగిరీకి 7 స్థానాలు కేటాయించారు. గుండాలతో పాటు 11 గ్రామాలకు చెందిన అర్హులైన సంఘ సభ్యులు ఓటు హక్కును వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. పోటీ చేసే అభ్యర్థులు నిర్దేశిత ఫారంలో నామినేషన్లు దాఖలు చేయాలని, బీసీ అభ్యర్థులకు రూ.750, ఓసీ అభ్యర్థులకు రూ.1,000 నామినేషన్ ఫీజు నిర్ణయించినట్లు తెలిపారు. నామినేషన్ ఉపసంహరణ అనంతరం తుది అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు. ఒకే అభ్యర్థి ఉంటే ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటిస్తారు. పోలింగ్ రోజున ఓటర్లు సంఘం గుర్తింపు కార్డు లేదా ఎన్నికల సంఘం ఆమోదించిన గుర్తింపు పత్రాన్ని తప్పనిసరిగా తీసుకురావాలని ఎన్నికల అధికారి సూచించారు.