మీట్యా తండా గ్రామపంచాయతీ భవనానికి భూమిపూజ.. నిర్మాణ స్థలంపై వివాదం
విశ్వంభర, ఇనుగుర్తి: మండలంలోని మీట్యా తండా గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి సోమవారం పంతులు తండాలో సర్పంచ్ భూక్య చిన్ని వెంకన్న భూమిపూజ నిర్వహించారు. రూ.20 లక్షలతో ఈజీఎస్ నిధుల ద్వారా ఆధునిక సౌకర్యాలతో భవనాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే డా. భూక్య మురళి నాయక్ కృషితో భవనం మంజూరైందని పేర్కొన్నారు. అయితే పంతులు తండాలో భవనం నిర్మించడాన్ని మీట్యా తండా, మర్రికుంట తండా వాసులు వ్యతిరేకించారు. గ్రామపంచాయతీ పరిధిలోని అన్ని తండాలకు అనుకూలంగా ఉండే ప్రాంతంలో భవనం నిర్మించాలని కోరుతూ అభ్యంతరం వ్యక్తం చేయడంతో రెండు వర్గాల మధ్య కొద్దిసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ వివాదంపై స్పందించిన సర్పంచ్, అటవీ భూమిలో నిర్మాణానికి అధికారులు అనుమతి ఇవ్వకపోవడంతోనే పంతులు తండాలో భవనం నిర్మిస్తున్నామని, దీనికి గ్రామపంచాయతీ పాలకమండలి తీర్మానం కూడా ఉందని స్పష్టం చేశారు. గ్రామాభివృద్ధి కోసం అందరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.