సీతారాంపురం, మడిపడిగ గ్రామాల్లో కాంగ్రెస్ గ్రామశాఖ కమిటీలు ఏకగ్రీవం
విశ్వంభర, గుండాల: గుండాల మండలంలోని సీతారాంపురం,మడిపడిగ గ్రామాల్లో భారత జాతీయ కాంగ్రెస్ గ్రామశాఖ కమిటీలను సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆదేశాల మేరకు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఇమ్మడి దశరథ గుప్తా సమక్షంలో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించారు. గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడం, ప్రజలకు చేరువ కావడం లక్ష్యంగా కమిటీలను ఏకాభిప్రాయంతో ఎన్నుకోవడం పట్ల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. సీతారాంపురం గ్రామశాఖ కమిటీ అధ్యక్షుడిగా బోరెం వెంకటరెడ్డి, ఉపాధ్యక్షుడిగా వేలగిరిపాక రామ్ నరసయ్య, ప్రధాన కార్యదర్శిగా కాళి మల్లేష్, కార్యదర్శిగా పాలడుగు వామన్, కోశాధికారిగా పిల్లలమర్రి మురళి, సోషల్ మీడియా కన్వీనర్‌గా పాలడుగు కృష్ణ ఎన్నికయ్యారు. మహిళా విభాగం అధ్యక్షురాలిగా దాసరి సంతోష, బీసీ మహిళా అధ్యక్షురాలిగా కూడా ఆమెనే ఎంపిక చేశారు. ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా మల్లెపాక మదన్మోహన్, మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా ఎండీ ఖలీల్, రైతు విభాగం అధ్యక్షుడిగా కాళి మల్లేష్ బాధ్యతలు స్వీకరించారు. మడిపడిగ గ్రామశాఖ కమిటీ అధ్యక్షుడిగా కొండబోయిన నర్సయ్య, ఉపాధ్యక్షుడిగా బోయినీ సోమయ్య, ప్రధాన కార్యదర్శులుగా పానుగంటి గంగాధర్, అనంతుల రాజు, కార్యదర్శిగా బోయినీ రాజశేఖర్, సహ కార్యదర్శిగా బోయినీ అశోక్, కోశాధికారిగా లింగంపల్లి పెద్ద పరశురాములు, సోషల్ మీడియా కన్వీనర్‌గా బోయినీ రాజశేఖర్, యూత్ కార్యదర్శిగా అనంతుల మహేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను గ్రామస్థాయిలో మరింత బలోపేతం చేస్తూ, ప్రజా సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేస్తామని, పార్టీ విస్తరణకు సమిష్టిగా కృషి చేస్తామని తెలిపారు. ఇరు గ్రామాల్లో ఏకగ్రీవంగా కమిటీలు ఎన్నిక కావడం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపిందని నాయకులు పేర్కొన్నారు.