కోటి మందిని కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యం

 విశ్వంభర, నెల్లికుదురు: కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని శ్రీరామగిరి సర్పంచి మాదరి ప్రశాంత్ అన్నారు. నెల్లికుదురు మండలం శ్రీరామగిరికి చెందిన చైతన్య, భరతమాత గ్రామైక్య సంఘాల 19వ,వార్షిక మహాసభ స్థానిక గ్రామపంచాయతీలో బుధవారం ఘనంగా జరుపుకున్నారు. దీనికి సర్పంచి ప్రశాంత్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలనలో మహిళకు సముచిత ప్రాధాన్యత ఇస్తుందన్నారు.ఈ సందర్భంగా మహిళా సంఘాలకు0వడ్డీ తో రుణాలు మంజూరి చేయడం గుర్తు చేశారు. మహిళలు నిరంతరం గృహానికే అట్టిపెట్టుకొని ఉండే సంస్కృతికి తెర తీస్తూ దేవాలయాల సందర్శన బంధుమిత్రుల వేడుకల ప్రయాణం కోసం ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రవేశపెట్టిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. బ్యాంకు రుణాలతో పాటు పొదుపు, సంఘాలు చేపట్టే వివిధ అభివృద్ధి కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుంటూ తమ తమ కుటుంబాలు ఆర్థిక పురోగతి సాధించాలని మహిళలకు సూచించారు. అనంతరం గ్రామంలోని 60 సంఘాలు తమ రికార్డులను పరిశీలించుకొని లావాదేవీలను సమీక్షించుకున్నాయి.రాబోయే సంవత్సరానికి ప్రణాళికల ను రూపొందించుకున్నాయి.నూతన పాలకమండలిలను ఎంపిక చేసుకున్నారు.ఈ కార్యక్రమంలోసి సి ఇంజమూరి పద్మ, వివో ఏ లు గంగిశెట్టి శ్రీనివాస్,నిమ్మల విజయ,సంఘాల అధ్యక్షులు మద్దెల రజిత,శీలం సంధ్య,  సభ్యులు బూర్గుల కవిత,కల్పన,అరుణ,పద్మ, హేమలత, మద్దెల జయమ్మ,తదితరులు పాల్గొన్నారు.

🕒 23 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/governments-aim-is-to-make-millionaires-millionaires/article-19436

Tags: