కాంగ్రెస్ పార్టీ ఇంటింటి ప్రచారం 

కాంగ్రెస్ పార్టీ ఇంటింటి ప్రచారం 

విశ్వంభర, సిద్దిపేట: గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయమని డిసిసి అధ్యక్షురాలు ఆంక్ష రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శనివారం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ 6వ వార్డులో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థి గాడిపల్లి నవ్య శ్రీ కి మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డు ప్రజలను ఉద్దేశించి ఆంక్ష రెడ్డి మాట్లాడుతూ,  గజ్వేల్ ప్రజ్ఞాపూర్ 6వ వార్డును కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం తథ్యమని అన్నారు. వార్డులో సిసి రోడ్లు అసంపూర్తిగా ఉన్నాయని, ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా వార్డులో దవాఖాన లేకపోవడం వల్ల స్థానికులు ఇబ్బంది పడుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. ఎన్నికల అనంతరం వార్డులో తప్పకుండా బస్తీ దవాఖాన ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావచ్చని భరోసా కల్పించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పని చేసే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవ్య శ్రీ ని భారీ మెజారిటీతో గెలిపించాలని వార్డు ప్రజలకు ఆమె విజ్ఞప్తి చేశారు,అలాగే  గజ్వేల్ ప్రజ్ఞాపూర్ లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు,ప్రజలు కాంగ్రెస్ పార్టీవైపు ఉన్నారని, మున్సిపల్ పీఠంపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.  ఈ కార్యక్రమంలో గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి, దాచారం సర్పంచ్ చెన్నారెడ్డి, కాంగ్రెస్ నాయకులు సుఖేందర్ రెడ్డి, గాడిపల్లి శ్రీనివాస్,జాకీర్, రాజేశ్వర్ రెడీ, సత్తయ్య, వినయ్, జనార్ధన్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.

Tags: