కాంగ్రెస్ ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీల అభ్యర్థుల ఖరారు.. రేసులో ఎవరంటే ?

కాంగ్రెస్ ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీల అభ్యర్థుల ఖరారు.. రేసులో ఎవరంటే ?

  • ఎమ్మెల్సీ అభ్యర్థులపై కాంగ్రెస్‌ అధిష్టానం  కసరత్తు
  • 5 సీట్లలో కాంగ్రెస్‌కు నాలుగు బిఆర్ఎస్ ఒకటి 
  • రాష్ట్ర స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు లాబీయింగ్‌ చేస్తున్న ఆశవాహులు
  • రేసులో జీవన్ రెడ్డి, జగ్గారెడ్డి, మధుయాస్కీగౌడ్‌ అద్దంకి దయాకర్,
  • వేం నరేందర్ రెడ్డి, సంపత్  ,ఈరవత్రి అనిల్, సామ రామ్మోహన్ రెడ్డి, 
  • బండి సుధాకర్ గౌడ్ , చరణ్ కౌశిక్, సునీతా రావు, సరితా యాదవ్ పేర్లు

విశ్వంభర, హైదరాబాద్ : ఈనెల 29వ తేదీతో తెలంగాణలో 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. అయితే ఈ ఎమ్మెల్సీ ఖాళీలను భర్తీ చేసేందుకు ఇప్పటికే ఎన్నికల సంఘం నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ఈ ఎమ్మెల్సీలుగా పోటీ చేసేవారు నామినేషన్‌లు దాఖలు చేసుకోవడానికి ఈనెల 10వ తేదీ వరకు గడువు విధించింది. ఇక ఖాళీ కానున్న 5 ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటి బీఆర్ఎస్‌కు, మిగిలిన 4 ఖాళీలు కాంగ్రెస్ పార్టీకి దక్కనున్నాయి. నామినేషన్‌ గడువు సమీపిస్తుండటంతో అభ్యర్థుల ఎంపికపై అధికార కాంగ్రెస్‌ దృష్టి సారించింది. ఆశావహుల జాబితాను పరిశీలించడంతోపాటు సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకొని అభ్యర్థుల ఎంపికకు కసరత్తు చేస్తోంది. పోటీ తీవ్రస్థాయిలో ఉండటంతో అభ్యర్థుల ఖరారు పార్టీకి సవాల్‌గా మారింది. ఇక ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ సీటు పొందేందుకు నేతలందరూ రాష్ట్ర స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు లాబీయింగ్‌లు చేస్తున్నారు. గతంలో పట్టభద్రుల నియోజకవర్గం నుంచి గెలిచి ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేయని జీవన్‌రెడ్డి తనకు ఎమ్మెల్యేల కోటాలో అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఇక మాజీ ఎంపీ మధుయాస్కీగౌడ్‌ కూడా ఎమ్మెల్సీ పదవికోసం డిల్లి  కేంద్రంగా  తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అలాగే టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కూడా డిల్లి కీ చేరుకొని తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు . ఇకవీరితో పాటు సిఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, టీపీసీసీ జనరల్‌ సెక్రటరీ అద్దంకి దయాకర్‌, సంపత్  ఈరవత్రి అనిల్, సామ రామ్మోహన్ రెడ్డి, మాజీ ఎంపి విజయశాంతి , జట్టి కుసుమ కుమార్, కుమార్ రావు, బండి సుధాకర్ గౌడ్, చరణ్ కౌశిక్, సునీతా రావు, సరితా యాదవ్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరంతా పార్టీ అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక  అభ్యర్థుల  ఖరారు విషయం లో ఈరోజు సిఎం రేవంత్ రెడ్డి , డిప్యూటి సిఎం బట్టి , మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి డిల్లి వెళ్లనున్నారు . అధిష్టానం పెద్దలతో చర్చలు అనంతరం రేపు లేదా ఎల్లుండి అభ్యర్థుల ఫైనల్ లిస్టు విడుదల చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది .