కాంగ్రెస్ అంటేనే స్కామ్ : కేటీఆర్
On
విశ్వంభర, హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం నుంచి సివిల్ సప్లైస్ శాఖలో కుంభ కోణం పై ఒక్కరూ మాట్లాడడం లేదని, కాంగ్రెస్ అంటేనే స్కాం లు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గల్లిమే లుటో…ఢిల్లీకి బేజో అన్నట్టుగా కాంగ్రెస్ నేతల తీరు ఉందన్నారు. కుంభకోణాలకు తెర లేపింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని పేర్కొన్నారు. వెయ్యి కోట్ల రూపాయల కుంభకోణం సివిల్ సప్లైస్ శాఖలో జరిగిందని, అయితే ఈ కుంభకోణంలో తెలంగాణ లోని కాంగ్రెస్ పార్టీ నేతలు కాకుండా ఢిల్లి పెద్దల హస్తం ఉందని తెలిపారు. రేవంత్ రెడ్డి పాత్ర ఈ కుంభకోణంలో ఉందని,ఇందులో అనుమానం లేదన్నారు. ఈ వ్యవహారంలో బీజేపీ పాత్ర విడ్డూరంగా, అనుమానాస్పదంగా ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు.
Tags: Ktr