వస్తాకొండూరు పాల సంఘం ఎన్నికల్లో కాంగ్రెస్ హవా
విశ్వంభర, గుండాల: యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని వస్తాకొండూరు గ్రామ పాల సహకార సంఘం ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి పిట్టల అంజయ్య చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే స్వామి రావు, బట్ట మేకల చంద్రయ్య డైరెక్టర్లుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన ప్రతినిధులను కాంగ్రెస్ నాయకులు అభినందించారు. కార్యక్రమంలో లింగాల భిక్షం గౌడ్, అనిల్ కుమార్ గౌడ్ తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయం పట్ల హర్షం వ్యక్తం చేశారు.