ఎమ్మెల్యే వేముల వీరేశంను  కలిసిన సంఘ ప్రతినిధులు

ఎమ్మెల్యే వేముల వీరేశంను  కలిసిన సంఘ ప్రతినిధులు

విశ్వంభర, రామన్నపేట: నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో సంఘం అధ్యక్షులు, కుల సభ్యులు ప్రభుత్వ విప్, నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశంను నకిరేకల్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్చం అందజేసి, శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రామన్నపేట మాజీ ఎంపీపీ పూస బాల నర్సయ్య, జిల్లా నాయకులు పూస బాలకిషన్‌తో పాటు సంఘానికి చెందిన పలువురు నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే వేముల వీరేశంతో భేటీ సందర్భంగా సంఘానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించినట్లు తెలిసింది. స్థానికంగా ఈ కార్యక్రమం ప్రాధాన్యత సంతరించుకోగా, గంగపుత్ర సంఘం సభ్యులు ఎమ్మెల్యేను కలవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు

Tags: