జోగులాంబ అమ్మవారికి వెండి బోనం సమర్పించిన కొల్లే సరిత

మురాద్ మహల్ నల్ల పోచమ్మ దేవాలయం నుంచి జోగులాంబకు వెండి బోనం

  • జోగులాంబ అమ్మవారికి వెండి బోనం సమర్పించిన కొల్లే సరిత.
  • మురాద్ మహల్ నల్ల పోచమ్మ దేవాలయం ఆధ్వర్యంలో ఘనంగా బోనాల వేడుకలు.
  • రాష్ట్ర ప్రజల సుఖశాంతి, రైతుల సుభిక్షం కోసం ప్రత్యేక ప్రార్థనలు.
  • బోనం సమర్పించే సమయంలో కురిసిన వర్షాన్ని శుభసూచకంగా అభివర్ణించిన కొల్లే సరిత

Telangana Ashada bonalu 2026: ఆషాఢ మాస బోనాల మహోత్సవాలను పురస్కరించుకుని హైదరాబాద్ పాతబస్తీ మురాద్ మహల్ నల్ల పోచమ్మ దేవాలయం కమిటీ ఆధ్వర్యంలో వెండి బోనాన్ని తెలంగాణలోని ఐదవ శక్తిపీఠమైన జోగులాంబ అమ్మవారికి ఘనంగా సమర్పించారు. తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల కో-ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ చైర్‌పర్సన్ కొల్లే సరిత (తిరుపతయ్య కురుమ) అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి వెండి బోనాన్ని సమర్పించారు. భక్తుల జైజైధ్వానాలు, సంప్రదాయ వాద్యాల నడుమ ఈ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో సాగింది.

ఈ సందర్భంగా కొల్లే సరిత మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన బోనాల జాతరకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. 2025 నుంచి హైదరాబాద్ మురాద్ మహల్ నల్ల పోచమ్మ దేవాలయం నుంచి జోగులాంబ అమ్మవారికి వెండి బోనం సమర్పించడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. బోనం అమ్మవారి గడపలోకి ప్రవేశించిన వెంటనే వర్షం కురవడం శుభసూచకమని, ఇది అమ్మవారి కరుణకు నిదర్శనమని పేర్కొన్నారు.

Read More కెప్టెన్ లక్ష్మి ఆశయాలతో యువత ముందుకు సాగాలి

రాష్ట్రంలో రైతులందరూ సంతోషంగా ఉండాలని, పంటలు సమృద్ధిగా పండాలని, ప్రతి కుటుంబం సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని అమ్మవారిని ప్రార్థించినట్లు కొల్లే సరిత తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మురాద్ మహల్ నల్ల పోచమ్మ దేవాలయ కమిటీ సభ్యులు, కుటుంబ సభ్యులు, భక్తులందరికీ ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి, జోగులాంబ నియోజకవర్గ ఇన్‌చార్జి మహాలక్ష్మి సంపత్ కుమార్, శివానంద స్వామి, జోగులాంబ దేవాలయం మాజీ చైర్మన్ వెంకటేశ్వర్లు, జోగిని (ఠాగూర్ ఐషు) బృందం, మురాద్ మహల్ నల్ల పోచమ్మ దేవాలయ కమిటీ చైర్మన్ చిట్టెం శ్యామ్‌రావు, సీనియర్ అడ్వైజర్ ఎడ్మ సత్తెప్ప, వైస్ ప్రెసిడెంట్ కంకర్ల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి ఆవుల మణికంఠ, దొంగిడి ప్రమోద్, అడ్వైజర్లు, కమిటీ సభ్యులు, బస్తీవాసులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

🕒 20 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/colle-sarita-who-offered-a-silver-bonam-to-goddess-jogulamba/article-18952