సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ అందజేత
On
విశ్వంభర, నెల్లికుదురు: సీఎం రిలీఫ్ ఫండ్ అనారోగ్య బాధితులకు గొప్ప వరమని సర్పంచి బెల్లంకొండ చైతన్య అన్నారు. ఎమ్మెల్యే డా. మురళి నాయక్ ఆదేశాల మేరకు నెల్లికుదురు మండలం మునిగల వీడు కు చెందిన ఉగ్గరాణి వెంకన్న, దుస్సరాదమ్మ లింగయ్య దంపతులకు రూ.53 వేల చెక్కులను శనివారం అందజేశారు. ఈ సందర్భంగా బెల్లంకొండ చైతన్య మాట్లాడుతూ, ప్రభుత్వం నుంచి అందే సహాయాన్ని, సంక్షేమ పథకాలను గ్రామంలోని అర్హులందరికీ వచ్చేలా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు గిరగాని ప్రవీణ్ కుమార్,ఐత వెంకటలక్ష్మి,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బొల్లికొండ నాగరాజు,తుప్పతూరి రాజు యాదవ్, గుంటూరు శ్రీనివాస్,అనంతరెడ్డి,కొలిపాక వెంకన్న,బైసా రాజశేఖర్,దేశబోయిన రాములు, ఇసంపల్లి చంద్రయ్య,సుమన్ తదితరులు పాల్గొన్నారు.



