చైతన్యపురిలో ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి.
- పాల్గొన్న ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ , డా. కాచం సత్యనారాయణ
On
విశ్వంభర, ఎల్బీనగర్ :- భారత రాజ్యాంగ నిర్మాత , భారతరత్న డా. బిఆర్ అంబెడ్కర్ 135వ జయంతి సందర్బంగా చైతన్యపురిలోని శివాజీ విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ , ప్రముఖ సామాజికవేత్త ,విత్రీ న్యూస్ ఛానల్, విశ్వంభర దిన పత్రిక ల సిఎండి డా. కాచం సత్యనారాయణ గుప్త పాల్గొని అంబెడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో అరుణ్ అంబెడ్కర్ , సాయినగర్ కాలనీ ప్రెసిడెంట్ లక్ష్మణాచారి, గౌరవ అధ్యక్షులు రామచంద్ర రెడ్డి , శోభా , లక్ష్మీబాయి తదితరులు పాల్గొన్నారు.



