పదవ తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు
విశ్వంభర, గుండాల: పదేళ్ల పాఠశాల ప్రయాణం... వెలకట్టలేని స్నేహం... కన్న తల్లిదండ్రులు లాగా విద్యాబుద్ధులు నేర్పిన గురువులు ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఆ గడప దాటి వెళ్తున్నామన్న బాధ మరో ఎత్తు యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గుండాల లో సోమవారం జరిగిన పదవ తరగతి విద్యార్థుల వీడుకోలు సమావేశం ఘనంగా జరిగింది. 9వ తరగతి విద్యార్థులు పదవ తరగతి విద్యార్థులకు ఏర్పాటుచేసిన ఈ వీడ్కోలు సమావేశంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గంధం చంద్రకళ మాట్లాడుతూ విద్యార్థులను ఆశీర్వదిస్తూ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి ఉన్నత శిఖరాలకు ఎదగాలని పాఠశాలకు తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన గ్రామ ఉపసర్పంచ్ ఆవుల సాయి ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులు సోషల్ మీడియా మోజులో పడి తమ భవిష్యత్తును అంధకారం చేసుకోవద్దని, ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలను మననం చేసుకుంటూ ఎటువంటి ఒత్తిడి లేకుండా పరీక్షలను మంచిగా రాసి ఈ పాఠశాలకు పేరు ప్రతిష్టలను తీసుకురావాలని సూచించారు. అనంతరము విద్యార్థులు చేసిన సాంస్కృత కార్యక్రమాలు అలరించాయి ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం సిఆర్పి లింగయ్య తదితరులు పాల్గొన్నారు.



